Begin typing your search above and press return to search.

వీడియో: 'గని' పంచ్ పార్టీలో రచ్చ రచ్చ..!

By:  Tupaki Desk   |   16 Feb 2022 1:30 PM GMT
వీడియో: గని పంచ్ పార్టీలో రచ్చ రచ్చ..!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ (బాబీ) - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ముగింపు వేడుకను 'గని పంచ్ పార్టీ' పేరుతో టీమ్ అంతా ఒకచోట చేరి స్టాండ్-అప్ కామెడీతో సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 'జబర్దస్త్' కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్ - బుల్లెట్ భాస్కర్ - ఇమ్మాన్యుయేల్ హోస్ట్ చేసిన ఈ ప్రోగ్రాఎం లో నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ పాల్గొన్నారు.

ఒకరి మీద ఒకరు 'పంచ్'లు వేసుకుంటూ నవ్వులు పూయిలు పూయించారు. వీడియో చివర్లో బాక్సింగ్ కు హ్యాండ్స్ కాదు.. నేను కాళ్ళు వాడానని హీరో వరుణ్ తేజ్ పంచ్ ఇచ్చి నవ్వించారు. ఫుల్ వీడియోని త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

'గని' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా - నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు.

రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. అబ్బూరి రవి సంభాషణలు రాశారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేసారు.

ఇకపోతే 'గని' సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అబ్బాయ్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గని' సినిమాని మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం మొదలైంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.