Begin typing your search above and press return to search.
నాగార్జున 4కోట్లు ఇవ్వాలని యువతి హల్ చల్
By: Tupaki Desk | 4 July 2018 8:35 AM GMTటాలీవుడ్ అగ్రహీరో నాగార్జున ఇంటి ఎదుట మంగళవారం రాత్రి ఓ యువతి వీరంగం సృష్టించింది. రోడ్డు నంబర్ 51లో ఉన్న నాగార్జున నివాసం వద్దకు వచ్చిన యువతి తనకు నాగార్జున తనకు రూ.4కోట్లు ఇవ్వాల్సి ఉందని.. ఆయన్ను కలువనీయాలని ఇంటి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగింది. నాగార్జున ఇంట్లో లేరని.. తర్వాత రావాలని సెక్యూరిటీ సిబ్బంది ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు నాగార్జున పీఏ వచ్చారు.
యువతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ‘నాగార్జున తనకు 4కోట్లు ఇవ్వాలని అందుకే వచ్చినట్టు ఆమె చెప్పడంతో ’ షాకయ్యాడు. నాగార్జున ఇంట్లో లేరని చెప్పాడు. అయినా వినిపించక గొడవ చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ యువతిని అదుపులోకి తీసుకొని విచారించారు. యువతి పేరు విజయ అని.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని తేల్చారు.ఆమె బంధువుల వివరాలు తెలుసుకొని వారికి అప్పగించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం.
ప్రస్తుతం నాగార్జున తన కొత్త సినిమా బిజీలో ఉన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కామెడీ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని కూడా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ‘దేవదాస్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నాగార్జున ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ఆయన ఇంటి ఎదుట యువతి హల్ చల్ చేయడం వార్తల్లో నిలిచింది..