Begin typing your search above and press return to search.

శ్రీదేవిని వచ్చాను.. చిరంజీవిని పిలవండి

By:  Tupaki Desk   |   10 Dec 2017 9:35 AM GMT
శ్రీదేవిని వచ్చాను.. చిరంజీవిని పిలవండి
X
హీరోల్ని కలవడానికి అభిమానులు ఎక్కడెక్కడి నుంచో రావడం.. వాళ్ల ఇళ్ల దగ్గర పడిగాపులు కాయడం మామూలే. హీరో బయటికి వెళ్తున్నపుడో.. ఇంట్లోకి వెళ్తున్నపుడో వాళ్లను ఒక చూపు చూసి చాలామంది అక్కడి నుంచి నిష్క్రమిస్తుంటారు. కొందరేమో.. లోపలికి వెళ్లాలంటూ సెక్యూరిటీ వాళ్లతో గొడవ పెట్టుకుంటుంటారు.

ఐతే తాజాగా ఒక చిరంజీవి అభిమాని మాత్రం.. తాను అతిలోక సుందరి శ్రీదేవినని.. తాను వచ్చానని చిరుకు సమాచారం ఇవ్వమని.. వెంటనే తనను కలవడానికి చిరు వస్తాడని ఆమె చెప్పడం విశేషం. ఆదివారం ఉదయం 7 గంటలకే చిరు ఇంటి వద్దకు చేరుకున్న ఆ మహిళ.. తాను శ్రీదేవినంటూ చెప్పుకుని చిరును పిలవాలని సెక్యూరిటీ వాళ్లతో గొడవ పెట్టుకుందట. దాదాపు మూడు గంటల పాటు ఆమె అక్కడ హల్ చేసినట్లు సమాచారం.

40 ఏళ్ల పైబడ్డ ఆ మహిళది పశ్చిమ గోదావరి జిల్లా అని.. ఆమె చిరంజీవికి అభిమాని అని.. ఐతే కొంత కాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని.. ఈ నేపథ్యంలో చిరు ఇంటి వద్దకు వచ్చి హడావుడి చేసిందని అంటున్నారు. చివరికి ఆమెకు సర్దిచెప్పి.. ఆమె సంబంధీకుల్ని రప్పించి.. ఎలాగోలా అక్కడి నుంచి పంపించేశారట చిరంజీవి సెక్యూరిటీ సిబ్బంది. ఈ విషయంలో చిరు దృష్టికి కూడా వెళ్లలేదని తెలిసింది. చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.