Begin typing your search above and press return to search.
హీరోపై 'ఆ' విమర్శలు చేసిన మహిళ అరెస్ట్
By: Tupaki Desk | 13 Jun 2019 1:52 PM GMTతమిళ హీరో విశాల్ గురించి కొన్ని నెలల క్రితం చెన్నైకు చెందిన విశ్వదర్శిని అనే మహిళ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. విశాల్ తన ఇంటి పక్కనే ఉన్న ఒక ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయితో విశాల్ కు సంబంధం ఉన్నట్లుగా ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో పెను సంచలనంగా నిలిచింది. విశాల్ గురించి వచ్చిన ఆ వార్తలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ఆ వ్యాఖ్యలు చేసిన మహిళపై కేసు నమోదు అయ్యింది.
గత కొన్ని రోజులుగా ఈ కేసు విషయంలో విచారణ జరుపుతున్న పోలీసులు విశ్వ దర్శినిని తాజాగా అరెస్ట్ చేసి ఎంక్వౌరీ చేస్తోంది. విశ్వదర్శినిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనిస్ట్ సెక్కువల్ అఫెన్స్ కేసును నమోదు చేయడం జరిగింది. తన కూతురుపై లేని పోని అబాండాలు వేసి నా కూతురు పరువు మా కుటుంబ పరువు తీసిందంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాల్ గోడ దూకి వారి ఇంట్లోకి దూరినట్లుగా తాను చూశాను అంటూ ఆమె చెప్పిన విషయం నిజం కాదని.. చాలా రోజులుగా విశ్వదర్శిని తన ఇంటి పక్కన ఉండే వారితో గొడవ పడుతూ ఉండేది. వారి పరువు తీయాలనే ఉద్దేశ్యంతో విశాల్ పేరును వాడింది.
గత కొన్ని రోజులుగా ఆమెను వెదుకుతూ ఉన్న పోలీసులకు ఆమె తిరుచెంకోడె ప్రాంతంలో కనిపించింది. వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. విశ్వ దర్శిని అరెస్ట్ పై ఫిర్యాదు దాఖలు చేసిన మహిళ మాట్లాడుతూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మంచి పని చేశారు. అలాంటి వారు బయట ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం అవ్వవు అంటూ చెప్పుకొచ్చింది.
ఈమద్య కాలంలో విశాల్ పై వరుసగా ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. విశ్వదర్శిని చేసిన ఆరోపణలు కూడా నిజమేనేమో అంటూ కొందరు నమ్మారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఆమె అరెస్ట్ తో వెళ్లడయ్యిందని విశాల్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.