Begin typing your search above and press return to search.
`ఆమె` నగ్న పోస్టర్లు తగలబెట్టారు!
By: Tupaki Desk | 19 July 2019 10:48 AM GMTఅమలాపాల్ నటించిన `ఆమె` నేడు రకరకాల వివాదాలు.. డైలమాల నడుమ రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆట వేయకపోయినా.. మధ్యాహ్నం నుంచి షోలు వేస్తున్నారు. అయితే మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన నగ్న పోస్టర్ల పై మహిళామణులు తీవ్రంగా విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని రిలీజ్ కానివ్వొద్దంటూ పలువురు మహిళలు నినాదాలు చేశారు. ఇక ఈ సినిమాలో నటించినందుకు అమలాపాల్ కు.. తెరకెక్కించిన దర్శకనిర్మాతలకు.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న భరద్వాజకు చీవాట్లు తప్పలేదు.
ఆమె అంటే అశ్లీలత కాదు.. ఆమె అంటే ఆత్మ గౌరవం! అంటూ `ఆమె` సినిమా పోస్టర్లను తగలబెట్టారు. మహిళల గౌరవాన్ని కాపాడాలని నినదించారు. మహిళల్ని కించపరిచే.. అగౌరవ పరిచే.. అంగట్లో వస్తువును చేసే సినిమాలు ఎన్నో వస్తున్నాయి. సభ్యసమాజంలో ఉన్నాం. ఆడపిల్లలపై అరాచకాల్లో నాలుగో స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎందుకని సెన్సార్ వాళ్లు అదుపు చేయలేకపోతున్నారు? అసలు ఎఫ్ డీసీ ఉన్నది ఎందుకు? అంటూ చెడామడా కడిగేశారు.
చిన్న పిల్లలు.. యూత్ పై దారుణ ప్రభావం చూపిస్తాయి ఇలాంటి సినిమాలు. తొమ్మిది నెలల పసికందును అత్యాచారం చేసిన ఘటనను మర్చిపోలేం. ఆడాళ్ల గురించి ఈ సినిమావోళ్లు ఎలాంటి మెసేజ్ లు ఇవ్వబోతున్నారు? అంటూ మహిళామణులు ప్రశ్నించారు. ఏదైనా అంటే కథ డిమాండ్ చేసిందని చెబుతుంటారు. 15 మంది మగాళ్ల ముందు నగ్నంగా నటించానని ఆవిడ (అమలాపాల్) చెబుతోంది. అది నా ఎక్స్ ప్రెషన్ అంటోంది. వ్వాటీజ్ యువర్ ఎక్స్ ప్రెషన్? అదేం క్రియేటివిటీ? ఇంత దిక్కుమాలిన క్రియేటివిటీని ఎలా చూపించగలుగుతున్నారు? అంటూ ఓ మహిళా సైకాలజిస్ట్ విరుచుకుపడ్డారు. తమ్మారెడ్డి అంతటి పెద్దాయన ఇలాంటి సినిమాని రిలీజ్ చేస్తారా? అంటూ మీడియా ముఖంగా దుయ్యబట్టారు.