Begin typing your search above and press return to search.

మహళా చిత్రాలపై అందుకే ధైర్యం చేయలేరు

By:  Tupaki Desk   |   13 March 2017 4:30 AM GMT
మహళా చిత్రాలపై అందుకే ధైర్యం చేయలేరు
X
ప్రతీ సినిమా పరశ్రమలోను హీరోల ఆధిక్యత ఉంటందని అనడంలో సందేహం ఉండదు. మార్కెట్ లెక్కలను బేస్ చేసుకుని హీరో ఓరియెంటెడ్ చిత్రాలకే ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాల విషయంలో అయితే.. టాలీవుడ్ బాగా వెనకడుగు వేయడం కనిపిస్తుంది.

ఒకరిద్దరు హీరోయిన్లతో మినహాయిస్తే అసలు హీరోయిన్ బేస్డ్ గా సినిమాలు తీసే ధైర్యం కూడా చేయరు. కథను నమ్మడం మానేసి.. హీరోయిన్ల మార్కెట్ బేస్ చేసుకునే సినిమాలు తీస్తుంటారు. అనుష్క.. నయనతార.. శ్రియ.. ఛార్మి.. అంజలి.. ఇలా చాలామందే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రయత్నించినా.. స్వీటీ-నయన్ లకే డిమాండ్ ఎక్కువ. తాను హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటించేందుకు సిద్ధమని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మంచి కథతో వస్తే చేస్తానన్న రకుల్.. ట్యాలెంట్ ను నమ్మి సినిమాలు చేయాలని అంటోంది.

గతంలో 60కిపైగా ఇలాంటి మహిళా కథా చిత్రాలు చేసిన జయసుధ... ప్రస్తుత పరిస్థితులను బేస్ చేసుకుని కథ తయారు చేసుకుంటే.. అది ప్రేక్షకులకు ఎక్కువ కనెక్ట్ అవుతుందని అంటోంది. డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా రిస్క్ చేసేందుకు సిద్ధపడరన్న దర్శకుడు గుణశేఖర్.. గతంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. తానే రిలీజ్ చేసుకునే వారు కాబట్టే అరుంధతి లాంటి సినిమాని అనుష్కతో చేయగలిగారని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/