Begin typing your search above and press return to search.

మీటూ : సూపర్‌ స్టార్‌ స్పందన ఇది

By:  Tupaki Desk   |   20 Oct 2018 4:59 PM GMT
మీటూ : సూపర్‌ స్టార్‌ స్పందన ఇది
X
దేశ వ్యాప్తంగా సెలబ్రెటీలను మరియు ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్న మీటూ ఉద్యమంపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్పందించారు. తాజాగా పేట చిత్రం షూటింగ్‌ ముగించుకుని లక్నో నుండి రజినీకాంత్‌ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మీడియా వారితో కేరళ అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ఆడవారు ప్రవేశం - మీటూ ఉద్యమం - వైరముత్తు అంశం ఇంకా రాజకీయ పార్టీకి సంబంధించిన పలు విషయాలను మాట్లాడటం జరిగింది.

కోర్టు తీర్పును గౌరవించాంటూనే - సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదని - కేరళ అయ్యప్ప స్వామివారి దేవాలయంకు ఆడవారి ప్రవేశం వద్దన్నట్లుగా రజినీకాంత్‌ అన్నారు. ఇక మీటూ ఉద్యమం గురించి రజినీకాంత్‌ మాట్లాడుతూ లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న ఆడవారికి ఇదో మంచి ఉద్యమం అని - తప్పకుండా మీటూ ఉద్యమం ద్వారా ఆడవారికి మేలు జరుగుతుందని రజినీకాంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీన్ని ఎవరూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా - సద్వినియోగం చేసుకోవాలని - కొందరి వల్ల లైంగిక వేదింపులు ఎదుర్కొనే మహిళలు నష్టపోవాల్సి వస్తుందని రజినీకాంత్‌ అన్నారు.

వైరముత్తు గురించి రజినీకాంత్‌ స్పందిస్తూ.. ఆయన తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చారు, తను నిర్దోషిత్వంను నిరూపించుకునేందుకు ఆయన కోర్టుకు వెళ్లారు. అందుకు అవసరమైన ఆధారాలను కోర్టుకు ఇస్తున్నట్లుగా ఆయన చెబుతున్నారు. వైరముత్తు నిర్ధోషిత్యవంను నిరూపించుకుంటాడని తాను భావిస్తున్నట్లుగా రజినీకాంత్‌ అన్నారు. ఇక పార్టీకి సంబంధించిన పనులు జరుగుతున్నట్లుగా కూడా రజినీకాంత్‌ ప్రకటించారు.