Begin typing your search above and press return to search.
మొగుళ్లను వదిలేసి వచ్చేస్తారు! హీరో బుక్డ్!!
By: Tupaki Desk | 28 May 2019 4:22 PM GMTఇటీవల స్టార్ హీరోల నోరు జారుడుతనం విమర్శలకు తావిస్తోంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ ఎలక్షన్ పేరుతో ఐశ్వర్యారాయ్ పై మీమ్స్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. అతడిలోని లేకి తనానికి మహిళామణులంతా బుద్ధి చెప్పారు. సాటి తారలు చీవాట్లు పెట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటి కామెంట్ నే చేసి అడ్డంగా దొరికిపోయాడు మరో స్టార్ హీరో సల్మాన్ భాయ్. ఇంతకీ ఆయనేమన్నారు? అంటే..
``ఆమె మొగుడి కోసం నా సినిమాను వదులుకుంది. నా సినిమా కోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు`` అంటూ సల్మాన్ కామెంట్ చేయడం సంచలనమైంది. ఇదంతా ప్రియాంక చోప్రాను ఉద్ధేశించి సల్మాన్ చేసిన వ్యాఖ్య. సల్మాన్ నటించిన భారత్ త్వరలో రిలీజవుతున్న సందర్భంగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అతడు ఈ కామెంట్ చేయడం ఆసక్తికరం. వాస్తవానికి భారత్ చిత్రంలో తొలుత ప్రియాంక చోప్రాని కథానాయికగా ఎంపిక చేశారు. కానీ అప్పటికే విదేశీ బోయ్ నిక్ జోనాస్ ప్రేమలో ఉన్న ప్రియాంక చోప్రా అతడిని పెళ్లాడేందుకు సిద్ధమై ఆ ప్రాజెక్టును వదులుకుంది. అటుపై పీసీపై సల్మాన్ చాలా సీరియస్ అయ్యాడని వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రశ్నిస్తే అనాలోచితంగా సల్మాన్ పై మాట అనేసి బుక్కయిపోయాడు.
అయితే సల్మాన్ అనాలోచితంగా అనేసి నవ్వేశాడు కానీ .. ప్రస్తుతం ఈ కామెంట్ పై మహిళా మణులు గరంగరంగా ఉన్నారు. స్త్రీవాద పురుషపుంగవులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ``నా సినిమా కోసం ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు..`` అన్నదానికి కౌంటర్లు బాగానే పడుతున్నాయ్. `నిజమైన మగవాళ్లు ఎవరూ అలా మాట్లాడరు..`` అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే... పీసీ ఓ నిజమైన మగాడి కోసం సల్మాన్ సినిమాను వదిలేసుకుందని కొందరు పంచ్ లపై పంచ్ లు విసిరేస్తున్నారు. మొత్తానికి సల్మాన్ భాయ్ ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు. దీనిని వదిలించుకోవాలంటే భారత్ సినిమాని రిలీజ్ చేసి సమ్మర్ వెకేషన్ కి ఎటైనా పోవాలేమో?!! నోరు జారిన ఫలితం ఇలానే ఉంటుంది సుమీ!!