Begin typing your search above and press return to search.

చెర్రీ మ్యాకోమ్యాన్ లుక్ వెన‌క ఎవ‌రున్నార‌బ్బా?

By:  Tupaki Desk   |   8 Jan 2023 11:30 AM GMT
చెర్రీ మ్యాకోమ్యాన్ లుక్ వెన‌క ఎవ‌రున్నార‌బ్బా?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త లుక్ స‌ర్ ప్రైజింగ్ గా లేదూ? .. ఇంత‌లోనే మ్యాకో లుక్ కి షిఫ్ట‌య్యాడు ఏంటి క‌థా క‌మామీషు? అంటే..వివ‌రాల్లోకి వెళ్లాలి. 11 జనవరి 2023న కాలిఫోర్నియాలో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యేందుకు మ‌న చెర్రీ ఇప్ప‌టికే సంసిద్ధ‌మ‌య్యాడు. అంత‌కుముందే ఈ శ‌నివారం సాయంత్రం కాలిఫోర్నియాలో జరిగిన అంత‌ర్జాతీయ బ్రాండ్ లూయిస్ విట్టన్ XW మ్యాగజైన్ అవార్డ్ సీజన్ కిక్ ఆఫ్ పార్టీకి హాజరయ్యాడు. కొద్ది సేపటి క్రిత‌మే ఫోటోలు అంత‌ర్జాలంలో వైరల్ అయ్యాయి.

RRR సీతారామ‌రాజు లుక్ అమాంతం మారిపోయి షాకిస్తోంది. మాకో మ్యాన్ లుక్ వెనుక ఉన్న హెయిర్ స్టైలిస్ట్ మెగ్ లాహ్నర్ ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీటికి ల‌క్ష‌లాదిగా లైక్ లు క్లిక్ ల‌తో హోరెత్తుతోంది. అంతేకాదు.. `వండర్ వుమన్` నటి సమంతా విన్ టాలీవుడ్ నటుడు రామ్ చ‌ర‌ణ్ తో ప్రేమలో పడిన ప్రముఖులలో ఒకరు అన్న సంగ‌తి తెలిసిన‌దే. స‌ద‌రు న‌టీమ‌ణి వ్యాఖ్యానిస్తూ... ``అతను బాగున్నాడు!! అతని కోసం వేళ్లు పడ్డాయి(ఫోటోని ఫోన్ లో త‌ర‌చి చూస్తూ)!`` అని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజనులు ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూస్తుండ‌గానే చెర్రీ హాలీవుడ్ కి కానీ వెళ్లిపోతాడా? అంటూ ఒక సెక్ష‌న్ మెగాభిమానుల్లో వింత ఆలోచ‌న‌లు కూడా పుట్టుకొస్తున్నాయి.

ఒక‌వేళ అత‌డు న‌టించిన‌ సినిమాల‌ను వ‌రుస‌గా ఇక హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా రిలీజ్ చేసే వ్యూహం ఏదైనా ర‌చిస్తుస్తాడా? త‌దుప‌రి స‌రికొత్త బిజినెస్ స్ట్రాట‌జీని అనుస‌రిస్తాడా? అన్న‌ది కూడా ఆస‌క్తి క‌రంగా మారింది. రామ్ చరణ్ ఒక న‌టుడు .. ఎంట‌ర్ ప్రెన్యూర్.. అంత‌కుమించి అనుభ‌వం ఉన్న‌ సినీనిర్మాత‌. అందువ‌ల్ల ఏదైనా జ‌ర‌గొచ్చు. చెర్రీ త్వరలో హైదరాబాద్ కు తిరిగి వస్తాడు. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తన తదుపరి చిత్రం RC 15 షూటింగును తిరిగి ప్రారంభించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ కథానాయిక. సునీల్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే స‌గం టాకీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసార‌ని స‌మాచారం.