Begin typing your search above and press return to search.

భాషా వివక్షను కెలికి ఫ్రీ ప‌బ్లిసిటీ కొట్టేశారుగా

By:  Tupaki Desk   |   21 Nov 2022 3:50 AM GMT
భాషా వివక్షను కెలికి ఫ్రీ ప‌బ్లిసిటీ కొట్టేశారుగా
X
వివాదంతో ప్ర‌చారం ఆర్జీవీ శైలి. ఇప్పుడు దీనిని అంద‌రూ కాపీ కొడుతున్నారు. ఏదో ఒక వివాదంతో ప్ర‌చారం అందుకోవ‌డం చాలా సులువుగా మార‌డంతో చాలామంది దీనినే అనుకరిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో అలాంటి ఒక వివాదాస్ప‌ద స‌న్నివేశం లేదా కాన్సెప్టుని తెలివిగా మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు క‌థ‌లో భాగం చేస్తున్న‌ వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. కొన్నిసార్లు యాధృచ్ఛికంగా వివాదాలు వ‌చ్చి ప‌డినా కానీ అది సినిమా ఉచిత ప్ర‌చారానికి బోలెడంత క‌లిసొస్తోంది.

ఇప్పుడు 'బెంగుళూరు డేస్' దర్శకురాలు అంజలి మీనన్ తాజా సినిమాపై ఇలాంటి విమర్శలు చెల‌రేగాయి. ఇప్ప‌టికే త‌న‌ సినిమా రివ్యూలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజనుల‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించి సోషల్ మీడియాలో మరో వివాదం చెలరేగింది. మూవీలో ఓ స‌న్నివేశం క్లిప్ ఇది. న‌టి నదియా నిర్వహించే 'ప్రినేటల్ సెంటర్'లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గర్భిణీ స్త్రీలు కలుసుకోవడం చిత్ర కథాంశం. ఈ సెంట‌ర్ లో ప్రీ మెట‌ర్నిటీ సూచ‌న‌లు స‌ల‌హాలు అందుతాయి. బిడ్డ పుట్టాక త‌ల్లులు ఏం చేయాలి.. ఎలా మెల‌గాలి? అనే అంశాల‌తో పాటు సింగిల్ మ‌ద‌ర్స్ కి స‌ల‌హాలు కూడా ఇక్క‌డ అందుతాయి.

అయితే సోష‌ల్ మీడియాలో విడుద‌లైన ఓ క్లిప్ లో భాషా వివ‌క్ష‌కు సంబంధించిన టాపిక్ వివాదాస్ప‌ద‌మైంది. ఈ క్లిప్ లో మొదట ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మహిళ నదియాకు ఇంగ్లీష్ అర్థం కానందున హిందీలో నేర్పించినా ఫ‌ర్వాలేద‌ని చెబుతుంది. అప్పుడు మరొక పాత్ర తనకు హిందీ అర్థం కాలేదని చెబుతుంది. దానికి ప్రథమ మహిళ హిందీని దేశ జాతీయ భాష అని క్లారిటీ ఇస్తుంది.

హిందీ- ఇంగ్లీషు కేవలం అధికారిక భాషలు మాత్రమే కానీ భారతదేశంలో జాతీయ భాషలు కావు అని చెప్పే మరో మహిళ వస్తుంది. చివరగా నార్త్ ఇండియన్ లేడీ తనకు మద్రాసీ కొంచెం తెలుసని చెబుతుంది. ఇతర మహిళ దక్షిణ భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయని మద్రాసీ అని పిలిచే ఏ భాష లేదని చెబుతుంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉత్తరాది- దక్షిణాది ప్రజల మధ్య చిచ్చు రేపుతోంది.

ఈ సీన్ పై ఇంటర్నెట్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. భాషా వివక్షను సినిమాలో చూపించారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వివాదాల కారణంగా ఈ సినిమా బోలెడంత ఉచిత ప‌బ్లిసిటీని కొట్టేస్తోంది.

వివాదాల‌తో ప్ర‌చారం ఈ సినిమాకి క‌లిసొస్తోంది. మ‌రోవైపు అంజ‌లి మీన‌న్ ఎంచుకున్న కాన్సెప్టు విల‌క్ష‌ణ‌మైన‌ది మహిళా సెంటిమెంటుతో కూడుకున్న‌ది గ‌నుక ఫ్యామిలీ ఆడియెన్ థియేట‌ర్ల వైపు వ‌స్తున్నారు. ఇందులో నిత్యామీన‌న్ లాంటి స్టార్ .. న‌దియా లాంటి సీనియ‌ర్ న‌టి.. ప్ర‌త్యేక పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.