Begin typing your search above and press return to search.

పొట్టినిక్క‌ర్ల‌తో న‌ట‌వార‌సురాళ్ల జింతాత‌!

By:  Tupaki Desk   |   27 Sep 2021 2:30 AM GMT
పొట్టినిక్క‌ర్ల‌తో న‌ట‌వార‌సురాళ్ల జింతాత‌!
X
ఇటీవ‌లి కాలంలో న‌ట‌వార‌సురాళ్ల ప‌బ్లిసిటీ హంగామా అన్ లిమిటెడ్ ట్రీట్ కి దారి తీస్తోంది. భామ‌లు అలా జిమ్ కి వెళ్లినా ప‌బ్లిక్ లోకి వెళ్లినా మార్కెట్లో క‌నిపించినా ఎక్క‌డైనా పొట్టి నిక్క‌ర్ల‌తో క‌నిపిస్తున్నారు. ఎక్స్ ప్లోజివ్ అనిపించే లుక్ తో మ‌తులు చెడ‌గొడుతున్నారు. ఇదంతా మీడియా అటెన్ష‌న్ ని త‌మ‌వైపు తిప్పేసుకునేందుకే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అదే స‌మ‌యంలో కార్పొరెట్ కంపెనీలు స‌ద‌రు భామ‌ల‌తో భారీ డీల్స్ కుదుర్చుకుని త‌మ ఉత్ప‌త్తుల‌కు విరివిగా ప్ర‌చారం చేయించుకుంటున్నాయి. ఇక న‌ట‌వార‌సురాళ్లు జాన్వీ- సారా బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెర‌గ‌డం వెన‌క ఈ పొట్టినిక్క‌రు కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ పొట్టినిక్క‌రు నిరంత‌రం హాట్ టాపిక్ గానే మారుతోంది. పొట్టినిక్క‌ర్ల‌లో ఫోజులివ్వ‌డం అమ్మ‌డికి కొత్తేం కాదు. ప‌ర్స‌న‌ల్ అయినా.. ప్రొఫెష‌న‌ల్ అయినా న‌ట‌వార‌సురాళ్లు జాన్వీ- సారా జోడీ ఎలివేషన్స్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. స్కిన్ టైట్ దుస్తుల్లో.. పిక్క‌లు దాకా క‌నిపించే జీన్స్ నిక్క‌ర్ల‌లో త‌ళుక్కున మెరుస్తున్నారు. ఇక యోగా దుస్తుల్లో అయితే జాన్వీ-సారా మంట‌లు పీక్స్ .. పూర్తిగా బాడీకి ఫిట్ అయ్యే దుస్తుల్లోకి దూరిపోయి మెస్మ‌రైజ్ చేయ‌డం ఈ భామ‌ల‌కే చెల్లింది. తాజాగా ఈ భామ‌లిద్ద‌రూ మ‌రోసారి వ‌దుల‌గా ఉండే పొట్టినిక్క‌ర్ లో క‌నిపించారు. పైలేట్స్ అనే ట్యాగ్ టాప్ పై క‌నిపించింది. లేత గులాబీ రంగు పైలేట్ గాళ్ అని రాసి పెట్టి ఉన్న టీష‌ర్టులు ధ‌రించి వీరంతా క‌నిపించారు.

ముంబైలో షాపింగ్ ముగించుకుని జిమ్ కి యోగాకి వెళ్లారా ఏమో! ఇలా బ‌య‌ట‌కు వ‌స్తూ కెమెరాకు చిక్కారు. ఇన్ స్టా వేదిక‌గా ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఇందులో హూ ఈజ్ యువ‌ర్ పైలెట్ గాళ్? అంటూ ఓ క్వ‌శ్చ‌న్ రెయిజ్ చేసారు. దీనికి కొంద‌రు జాన్వీ పేరుని..మ‌రికొంత మంది సారా పేరుని చెప్పారు. మెజార్టీ వ‌ర్గం ఇద్ద‌రు హాట్ గాళ్స్ ని ఫేవ‌రేట్ గానే భావించార‌ని కామెంట్లు చూస్తే తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రు ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీగా ఉన్నారు.