Begin typing your search above and press return to search.

'తెలుగు' అభిమానం బుక్ చేసిందా?

By:  Tupaki Desk   |   15 March 2020 5:30 PM GMT
తెలుగు అభిమానం బుక్ చేసిందా?
X
చేతులు కాలాక‌ ఆకులు ప‌ట్టుకుంటే ఏం లాభం? జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయాక తేరుకున్నా ప్ర‌యోజ‌నం ఏం ఉంటుంది? తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ స‌న్నివేశం అదే. కోలీవుడ్ లో బిజీగా ఉన్న స‌మ‌యంలో తెలుగులోనూ స‌త్తా చాటాల‌ని ప్లాన్ చేసింది. తొలి ప్ర‌య‌త్నంగా కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి అనే ఓ స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అటుపై మిస్ మ్యాచ్ అనే మ‌రో సినిమాలో న‌టించింది. ఆ సినిమా నిరుత్సాహాన్నే మిగిల్చింది. ఇదే స‌మ‌యంలో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న భార్య పాత్ర‌లో న‌టించే ఛాన్స్ ఒడిసిప‌ట్టుకుంది.

టాలీవుడ్ లో ఇదే బిగ్ ఛాన్స్ కావ‌డంతో వెన‌కా ముందు ఆలోచించ‌కుండా విజ‌య్ కు భార్య‌గా.. ఓ బిడ్డ‌కు త‌ల్లి పాత్ర‌లో న‌టించింది. అందులో నేచుర‌ల్ పెర్సామెన్స్ తో ఆక‌ట్టుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితం రివ‌ర్స్ అయ్యింది. పైగా ఐశ్వ‌ర్య రోల్ కేవ‌లం ఒక సెక్ష‌న్ ఆడియెన్ కే క‌నెక్ట‌య్యేలా తీర్చిదిద్ద‌డం త‌న‌కు మైన‌స్ గా మారింది. ఇప్పుడు లేటయినా ఆ త‌ప్పుల్ని గ్ర‌హించిందో ఏమో! భ‌విష్య‌త్ లో అమ్మ పాత్ర‌ల‌ను చేయ‌నంటూ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ‌చ్చిన గుర్తింపు చాలు అంటూ వ‌చ్చిన తల్లి పాత్ర‌ల‌ను రిజెక్ట్ చేస్తోందట‌. అంత‌కుముందు కోలీవుడ్ ప్ర‌య‌త్నాలు చేసినా అవ‌న్నీ ఇప్పుడు బెడిసికొడుతున్నాయ‌ట‌.

అందుకే భ‌విష్య‌త్ లో అమ్మ పాత్ర‌లు చేయ‌లేనంటూ ఖ‌రాకండిగా చెప్పేసింది. అమ్మ పాత్ర ఇమేజ్ వ‌ల్ల యువ హీరోలు త‌న‌తో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేద‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ లో ఐశ్వ‌ర్య‌ని మ‌రీ మేక‌ప్ లేకుండా డీగ్లామ‌రైజ్డ్ గా చూపించ‌డం కెరీర్ కే మైన‌స్ గా మారింద‌ట‌. కార‌ణాలు ఏవైనా ఐశ్వ‌ర్య కెరీర్ ఇప్ప‌టికే గాడి త‌ప్పింది. మ‌రి ప్ర‌స్తుతం ఉన్న పోటీలో వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలంటే అద్భుతాలే జ‌ర‌గాలి. మ‌రో ఆస‌క్తిక‌ర సంగ‌తేమిటి అంటే నాని హీరోగా న‌టిస్తోన్న ట‌క్ జ‌గ‌దీష్ లో ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో ఒదిగిపోయి న‌టిస్తోంద‌ట‌. అయితే క‌మిట్ మెంట్ ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు రాక‌ముందు చూపిస్తే బావుండేదని విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుత‌ ఫేజ్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.