Begin typing your search above and press return to search.
ఫేమస్ లవర్ ఆడిందే ఆట పాడిందే పాట!
By: Tupaki Desk | 30 Jan 2020 9:23 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్రవరి 14న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార చిత్రాలతో హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. పోస్టర్లు ..టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ అంచనాలను రిలీజ్ వరకూ అలాగే కంటిన్యూ చేయాలంటే మధ్యలో ట్రైలర్ ట్రీట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూనిట్ ఆ పనిలోనే నిమగ్నమైంది. ట్రైలర్ కోసం టీమ్ వర్క్ చేస్తోంది. స్వయంగా రౌడీ గారే బరిలో దిగి స్పీడప్ చేస్తున్నారట.
ప్రస్తుతం ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయి. అయితే దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రైలర్ కట్ చేయడం లో వీక్. అందుకే దేవరకొండ స్వయంగా బరిలో దిగాడన్న ముచ్చటా వినిపిస్తోంది. నిర్మాత వల్లభనేనితో కలిసి దేవరకొండనే ఆ పనులు చక్కబెడుతున్నాడట. వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ డిజైన్ మొత్తం దేవరకొండ ఆధ్వర్యంలోనే జరుగుతోందట. క్రాంతి మాధవ్ గత చిత్రాల ట్రైలర్లను స్టడీ చేసిన తర్వాత దేవరకొండనే నేరుగా సీన్ లోకి ఎంటర్ అయ్యాడని చెబుతున్నారు. దీంతో పాటే మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతల్ని కూడా దేవరకొండ నే చూసుకున్నాడుట.
సినిమా సెట్స్ లో ఉన్నంత కాలంలో దేవరకోండ ఎంత చెబితే అంత అని... సెట్స్ లో ఆయన మాటనే నెగ్గిందని చెబుతున్నారు. అలాగే చిత్రీకరణ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైన తర్వాత దేవరకోండ అన్నిటా ఇన్వాల్వ్ అవుతున్నారట. నిర్మాతలు కె.ఎస్ రామారావు ... వల్లభ ఈ విషయంలో దేవరకొండ కు కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చారట. అయితే విజయ్ తన సినిమాల సక్సెస్ కోసం బ్లడ్ అండ్ బోన్ అన్నట్టుగా పని చేయడం చూస్తున్నదే. ఇంతకుముందు నోటా .. ట్యాక్సీవాలా లాంటి సినిమాలకు దేవరకొండ మార్క్ పనితనం కొంతమేరకు అస్సెట్ అయ్యింది. ఇన్వాల్వ్ అవ్వడం అంటే దర్శకుడిని పక్కన పెట్టాడని కాదు.. అవసరం మేర తాను చొరవ తీసుకున్నాడని భావించాలేమో!