Begin typing your search above and press return to search.
బాండ్ 007తో వరల్డ్ లార్జెస్ట్ ఐమాక్స్ లాంచింగ్
By: Tupaki Desk | 28 Sep 2021 6:30 AM GMTప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లాంచింగ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకూ వరల్డ్ లో రెండే రెండు ఐమ్యాక్స్ ల గురించి ప్రత్యేకంగా చర్చ సాగింది. ఇందులో హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఐమ్యాక్స్ గా పాపులరైంది. ఇప్పుడు వీటన్నిటి కంటే అతి పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ ని జర్మనీలో తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. జర్మనీలోని లియోన్ బర్గ్ లోని ట్రామాప్లాస్ట్ మల్టీప్లెక్స్‌లో ఈ స్క్రీన్ ఉంది. 70 అడుగుల ఎత్తు .. 125 అడుగుల వెడల్పుతో సెట్ చేయబడిన అతి భారీ స్క్రీన్ ఇదని చర్చ సాగుతోంది.
జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ `నో టైమ్ టు డై` రిలీజ్ తో జర్మనీ ఐమ్యాక్స్ ని లాంచ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. బాండ్ 007 ప్రదర్శనతో ట్రామాప్లాస్ట్ IMAX ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ నటిస్తున్నారు. ఇదే అతడికి ఫ్రాంఛైజీలో చివరి అవకాశం అని తెలిసింది.
నెట్ ఫ్లిక్స్ లో బాండ్ 25.. థియేట్రికల్ రిలీజ్ సందేహమే!!
బాండ్ సిరీస్ లో 25వ చిత్రం `నో టైమ్ టు డై` టైమ్ ఏమంత బావున్నట్టు లేదు. ఇప్పటికే ఈ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడింది. మహమ్మారీ దెబ్బకు అంతకంతకు వెనక్కి వెళ్లిపోతోంది. ఇటీవలే ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడిందని కథనాలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేనందును ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లేదా ఆపిల్ స్ట్రీమింగ్ కి విక్రయించనున్నారని ప్రచారమవుతోంది. ఆ మేరకు చిత్రబృందంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ప్రముఖ హాలీవుడ్ వెబ్ సైట్లు కథనాల్ని వెలువరించాయి.
రాబోయే జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్ కు వెళ్ళవచ్చు అన్న ఊహాగానాలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాండ్ సిరీస్‌లోని 25 వ చిత్రం .. అలాగే డేనియల్ క్రెయిగ్ నటిస్తున్న 007 సిరీస్ చివరి చిత్రం `నో టైమ్ టు డై` 2020 బెస్ట్ క్రేజీ చిత్రంగా చర్చల్లో ఉంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన ముందు వరుస చిత్రమిదన్న చర్చా సాగుతోంది. 2020 నవంబర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడింది. ఆ తర్వాతా సెప్టెంబర్ రిలీజ్ అన్నారు .. కానీ కుదరలేదు. అక్టోబర్ 8న ఎట్టకేలకు అమెరికాలో ఈ చిత్రం విడుదలవుతోంది. అలాగే ఫేస్ బుక్ లో ప్రీమియర్ చేస్తుండడం ఆసక్తికరం.
థియేటర్లను వదిలేసి నో టైమ్ టు డైని అత్యధిక బిడ్డర్ కు విక్రయించడానికి MGM ఒత్తిడిలో ఉందని కథనాలొచ్చాయి. పలు స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలు ఈ చిత్రాన్ని చాలా పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నో టైమ్ టు డై నిర్మాణానికి బడ్జెట్ $ 250 మిలియన్లు ఖర్చయ్యింది. కాబట్టి థియేట్రికల్ విడుదలను అధిగమించాలంటే.. స్ట్రీమింగ్ బిడ్లు అనూహ్యంగా భారీ మొత్తంలో ఉండాలని అంచనా వేసిన సంగతి తెలిసిందే. మహమ్మారి కారణంగా థియేటర్లు తెరవడం ఆలస్యం అయిన తరువాత ఆపిల్ టీవీ + ఈ సంవత్సరం ప్రారంభంలో టామ్ హాంక్స్ `గ్రేహౌండ్స్` ని కొనుగోలు చేసినప్పుడు బాండ్ సినిమాని కొనుగోలు చేయాలని భావించింది. కానీ ఆ వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. బాండ్ సిరీస్ చివరి సినిమా నో టైమ్ టు డై ని అమెరికా- బ్రిటన్ లలో థియేటర్లలో విడుదల చేస్తుండడం ఆసక్తికరం. ఆ మేరకు ప్రఖ్యాత స్క్రీన్ ర్యాంట్ తాజాగా కథనం వెలువరించింది. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.