Begin typing your search above and press return to search.

మన టీ సిరీస్ కు వరల్డ్‌ రికార్డ్‌

By:  Tupaki Desk   |   7 Dec 2021 9:33 AM GMT
మన టీ సిరీస్ కు వరల్డ్‌ రికార్డ్‌
X
ఇండియన్ ఫిల్మ్ రంగంలో టీ సిరీస్‌ స్థానం చాలా ప్రత్యేకం. ఎన్నో సినిమాలను నిర్మించి ఇండియన్‌ సినీ అభిమానులకు అందించిన టీ సిరీస్ కొన్ని లక్షల పాటలను మ్యూజిక్ సంస్థగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాయి. టీ సిరీస్‌ మ్యూజిక్ రంగంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. మారుతూ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా టీ సిరీస్ కూడా మారుతూ సాంకేతిక పరిజ్ఞానంను పెంచుకుంటూ అభిమానులకు మరియు ప్రేక్షకులకు పాటలను విభిన్నమైన శైలిలో అందిస్తూ వస్తుంది. టీ సిరీస్‌ సంస్థ ద్వారా వచ్చిన పాటలు ఆల్ టైమ్‌ హిట్స్ గా ఎన్నో నిలిచాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల సినిమాల మ్యూజిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన టీ సిరీస్‌ ఇప్పుడు యూట్యూబ్‌ లో అత్యద్బుతమైన రికార్డును నమోదు చేసింది.

క్యాసెట్లు.. సీడీల తర్వాత ఇప్పుడు యూట్యూబ్‌ ద్వారా పాటలను విడుదల చేసే ఆనవాయితీ వచ్చింది. యూట్యూబ్‌ వినియోగం ఇండియాలో విపరీతంగా పెరగడంతో పాటు పాటలు వినేందుకు టీ సిరీస్ యూట్యూబ్‌ ఛానెల్ ను కోట్ల మంది ప్రతి రోజు ఆశ్రయిస్తూ ఉంటారు. బాలీవుడ్‌.. టాలీవుడ్‌.. కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ కు సంబంధించిన స్టార్స్.. సూపర్‌ స్టార్స్‌ పాటలు టీ సీరిస్ ద్వారా విడుదల అవుతూ ఉన్నాయి. కనుక అత్యధిక ఖాతాదారులను కలిగిన యూట్యూబ్‌ ఛానెల్‌ గా టీసీరిస్ నిలిచింది. ప్రపంచంలో ఏ మ్యూజిక్ సంస్థ కూడా దక్కించుకోలేని అరుదైన 200 మిలియన్ సబ్‌ స్క్రైబర్స్ ను ఇండియన్ మ్యూజిక్ సంస్థ అయిన టీ సీరిస్‌ దక్కించుకుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ కు గౌరవం అంటూ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీ సిరీస్ లో కేవలం పాటలు మాత్రమే కాకుండా ఆ సంస్థ ద్వారా నిర్మించే సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌ లు మరియు మేకింగ్‌ వీడియోలు.. వీడియో సాంగ్స్ ఇలా అన్ని కూడా స్క్రీనింగ్‌ చేస్తూ ఉంటారు. అందుకే అత్యధిక ఇండియన్స్ ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా ఈ యూట్యూబ్‌ ఛానెల్‌ కు సబ్‌ స్క్రైబ్‌ అయ్యారు. ఇండియాలో అత్యధిక ఆదాయం కలిగిన మ్యూజిక్ సంస్థగా టీసీరిస్ ను చెబుతూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రతి రోజు ఇందులో పాటలు వింటారు. అందుకే టీ సీరిస్ కు అరుదైన వరల్డ్ రికార్డు దక్కింది. 200 మిలియన్ మార్క్ రికార్డ్ ను తమ టీమ్ కు అంకితం ఇస్తున్నట్లుగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ భూషణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.