Begin typing your search above and press return to search.

థియేటర్ల రీ-ఓపెనింగ్ కోరితే బాగుండేదా?

By:  Tupaki Desk   |   24 May 2020 7:27 AM GMT
థియేటర్ల రీ-ఓపెనింగ్ కోరితే బాగుండేదా?
X
టాలీవుడ్ లోని పెద్దలు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం.. త్వరోలోనే షూటింగులు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడం తెలిసిన విషయాలే. మొదట తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయ్యి పరిస్థితులను వివరించారు. షూటింగులు ఆగిపోవడంతో నష్టం జరుగుతోందని.. సినీ కార్మికులకు ఉపాధి దూరమైందని.. షూటింగులకు అనుమతినివ్వాలని కోరారు. తర్వాత తలసాని చొరవతో చిరంజీవి.. నాగార్జున.. రాజమౌళి తదితరులు ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి చర్చించారు. ముఖ్యమంత్రి కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సరే అనడంతో ఇక షూటింగులకు మార్గం సుగమం అయింది.

త్వరలోనే షూటింగులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ విషయంలో ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్ల వెర్షన్ వేరేగా ఉంది. మొదట థియేటర్లను తెరించేందుకు అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు ప్రభుత్వాన్ని కోరాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే థియేటర్లు మూసిన కారణంగానే సినిమాల విడుదల ఆగిందని.. ఒక్కసారి థియేటర్లు రీ-ఓపెన్ అయితే రిలీజులకు సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్లకు వస్తాయని అంటున్నారు. థియేటర్లు ఓపెన్ చేసిన మొదటి రెండు నెలల జనాలు అలవాటు పడతారు కాబట్టి ఆగష్టు నాటికి సాధారణ స్థితి నెలకొనే అవకాశం ఉందని వారి అభిప్రాయం.

ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్లు చెప్పేది నిజమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే థియేటర్లు ఓపెన్ చేస్తే కాని జనాలు మునుపటిలాగా వస్తారా రారా అన్నది తెలియదు. మరి సినీ పెద్దలు ఈ విషయంలో ఏం చేస్తారో వేచి చూడాలి.