Begin typing your search above and press return to search.
'చావుకబురు చల్లగా'లో ఆ సీన్ ను యాడ్ చేస్తారా?
By: Tupaki Desk | 23 March 2021 10:49 AM GMTకార్తికేయ హీరోగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'చావుకబురు చల్లగా' ఇటీవలే థియేటర్లకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో కౌశిక్ మాట్లాడాడు. "ఈ సినిమా కథ అంతా కూడా పీటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ పీటర్ ఎవరన్నది మాత్రం చూపించం. ఆ పాత్రను గురించి మేము అలాగే చెప్పాలనుకున్నాము .. చెప్పాము. ఇక సినిమా చూసిన వాళ్లంతా కూడా తమకి ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ నచ్చిందని చెబుతున్నారు. వాళ్లకి అలా అనిపిస్తే మేము సక్సెస్ అయినట్టేనని ముందుగానే అనుకున్నాము.
ఆమని పాత్ర మందుతాగడం గురించి కొంతమంది అడుగుతున్నారు. ఆమెకి ఎదురైన పరిస్థిలోతులు .. ఎదుర్కొన్న సంఘటనలు అలా మార్చాయని అనుకోవచ్చు. ఆ పాత్ర ద్వారా ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది కూడా. నేను కూడా అలాంటి వాళ్లను చూశాను .. బయట నేను చూసిన కొన్ని సంఘటనలను నా కథలోకి తెచ్చుకున్నాను. అంతేగానీ కావాలనే ఉద్దేశంతో ఆమని పాత్రను అలా చూపించాలని అనుకోలేదు. ఈ సినిమాలో ఆమని - కార్తికేయ కాంబినేషన్లోని ఒక సీన్ ను ఇంకా క్లారిటీగా చెప్పవలసింది. అలాగే ఆమని - శ్రీకాంత్ అయ్యంగార్ కి సంబంధించిన సీన్ ను ఎడిటింగ్ లో లేపేయకుండా ఉండవలసింది.
ఆమని - శ్రీకాంత్ అయ్యంగార్ సీన్ ను లెంగ్త్ కారణంగా లేపేయడం వల్లనే, ఆమని పాత్ర విషయంలో ఆడియన్స్ కి క్లారిటీ లేకుండా పోయింది. అందువల్లనే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ సీన్ ఉంటే ఆడియన్స్ ఆశించే క్లారిటీ వచ్చి ఉండేది. అల్లు అరవింద్ గారు అడిగారు కూడా .. ఆ సీన్ లేపేయడం వలన చెప్పదలచుకున్న విషయం కన్వే అవుతుందా అని. అవుతుందని చెప్పడమే నేను చేసిన మిస్టేక్. ఆ సీన్ ను యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అయితే అది ఎంతవరకూ సాధ్యమవుతుందనేదే చూడాలి" అంటూ చెప్పుకొచ్చాడు.