Begin typing your search above and press return to search.
పవన్ పై రైటర్ చిన్నికృష్ణ కామెంట్
By: Tupaki Desk | 24 March 2019 6:51 AM GMTసమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత చిన్నికృష్ణ ప్రస్తుతం వైకాపాలో చేరి పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు జోరుగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ లో ఆంధ్రా వాళ్లని పరిగెత్తిచ్చి కొడుతున్నారు. మన వాళ్లకి అక్కడ రక్షణ లేదు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ తలదూర్చొద్దు. మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దు! అంటూ కృష్ణాజిల్లా ఎన్నికల ప్రచరంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిన్ని కృష్ణ రివర్స్ కౌంటర్ వేశారు. 'నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకోవాల్పిందే. మీరు.. మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు కలిపారో ఆ పార్టీ సభ్యులందరికి కూడా పేరు పేరున చెబుతున్నాను. నా నోరు తెరిపించే పనిచేయొద్దని హెచ్చరిస్తున్నాను .. అంటూ చిన్నికృష్ణ వ్యాఖ్యానించడం సంచలనమైంది.
'స్వార్థపూరిత రాజకీయాల కోసం హైదరాబాద్ లో వున్న ఆంధ్రుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా?. ఎన్నికల్లో పోటీ చేస్తూ మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి. జగన్ లాగే మీరూ పార్టీ పెట్టుకున్నారు. ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి.. కానీ జగన్ పై నిందలేస్తారా? కోడి కత్తిపై విషం చిమ్ముతారు. అతనికి అతనే పొడిపించుకున్నాడంటారు. బాబాయ్ హత్య జరిగితే జగన్ పైనే నెట్టేసే ప్రయత్నం చేస్తారు. రేపు జగన్ తనకు తానే విషం తాగి చనిపోయాడని అంటారేమో' అని అన్నారు. ఆంధ్రా ఓటర్లు ఎటు వైపు ఉన్నారో మే ఎన్నికల్లో తెలుస్తుంది. ఫలితాల రోజు టీవీ ముందు కూర్చున్న మీకు గుండెలు పగిలే నిజం బయటికి వస్తుంది. అంత మెజారిటీతో జగన్ గెలవబోతున్నారు.. మీరే చూస్తారు ఇదంతా.. అంటూ ఘాటుగా స్పందించారు చిన్నికృష్ణ.