Begin typing your search above and press return to search.

రైట‌ర్ ఎంట్రీతో టెన్ష‌న్ లో మెగా ఫ్యాన్స్‌..!

By:  Tupaki Desk   |   3 Aug 2022 2:30 AM GMT
రైట‌ర్ ఎంట్రీతో టెన్ష‌న్ లో మెగా ఫ్యాన్స్‌..!
X
మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల విరామం త‌రువాత 'ఆచార్య' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై అభిమానుల్ని తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. ఊహించ‌ని విధ‌గంగా డిజాస్ట‌ర్ గా రిల‌వ‌డంతో ఫ్యాన్స్ ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేక‌పోతున్నారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ మార‌డం ఇప్ప‌టికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట.

ఈ నేప‌థ్యంలో ఓ వార్త మెగా ఫ్యాన్స్ ని మ‌రింత టెన్ష‌న్ కు గురిచేస్తోంది. కార‌ణం రైట‌ర్‌, క‌మ్ డైరెక్ట‌ర్ బీవీఎస్ ర‌వి అని తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా బీవీఎస్ ర‌వి హ్యాండ్ పెట్టిన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డుతున్నాయి.

ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డం లేదు. అంతే కాకుండా రీసెంట్ గా ఆయ‌న క‌థ అందించిన సినిమా 'థాంక్యూ' ఇటీవ‌ల విడుద‌లై తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్‌లో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు.

ఇంత మంది ప‌క్కాగా ప్లాన్ చేసినా బీవీఎస్ ర‌వి అందించిన క‌థ సినిమాను నిల‌బెట్ట‌లేక‌పోయింది. ద‌ర్శ‌కుడిగానూ ప‌రిచ‌యం అవుతూ గోపీచంద్ హీరోగా 'వాంటెడ్‌' మూవీని రూపొందిస్తే అది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. రైట‌ర్ గా త‌ను ఇటీవ‌ల చేసిన సినిమాలేవీ ఆశించిన ఫ‌లితాల్ని అందించ‌క‌పోవ‌డంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు కంగారు ప‌డుతున్నారట‌. వారి కంగారుకు కార‌ణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న రెండు క్రేజీ సినిమాల‌కు బీవీఎస్ ర‌వి వ‌ర్క్ చేస్తున్నారు.

మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న 'భోళా శంక‌ర్‌', బాబీ రూపొందిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌' చిత్రాల క‌థ‌ల్లో బీవీఎస్ ర‌వి హ‌స్తం వుంది. 'భోళా శంక‌ర్‌' త‌మిళ రీమేక్ అయినా తెలుగు నేటి విటీకి అనుగుణంగా బీవీఎస్ ర‌వి, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌ మార్పులు చేశార‌ట‌. ఇక 'వాల్తేరు వీర‌య్య‌'దీ ఇదే ప‌రిస్థితి. ఈ సినిమాకు కోన వెంక‌ట్‌, కె. చ్ర‌వ‌ర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడు బాబి క‌థ అందించినా అందులో ర‌వి హ్యాండ్ వుంద‌ట‌.

ఇప్పుడు ఇదే మెగా ఫ్యాన్స్ ని టెన్ష‌న్ కు గురిచేస్తోంది. 'ఆచార్య‌'తో డిజాస్ట‌ర్ ని ఎదుర్కొన్న చిరు వెంట‌నే హిట్ కొట్టాల‌ని ఎదురుచూస్తుంటే చిరు నుంచి రానున్న రెండు ప్రాజెక్ట్ ల‌లోకి స్క్రీప్ట్‌ల‌కు రైట‌ర్ బీవీఎస్ ర‌వి ఎంట్రీ ఇవ్వ‌డం ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తోంద‌ట‌.