Begin typing your search above and press return to search.
నాకేమీ బ్రాంచీల్లేవ్! నా పేరు చెప్పుకుని డబ్బు దండుతున్నారు!రచయిత ఫైర్!!
By: Tupaki Desk | 10 July 2021 5:34 AM GMTనాకేమీ బ్రాంచీల్లేవ్! నా పేరు చెప్పుకుని డబ్బు దండుతున్నారు! అసలు నాకు అసిస్టెంట్లు సహాయకులు ఎవరూ లేరు! అంటూ ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల ఫైరయ్యారు. అబద్ధాలు చెప్పుకుని డబ్బు దండుకుంటున్న సదరు అసిస్టెంట్ రచయితలం అని చెప్పుకునేవారి విషయంలో ఇండస్ట్రీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
అలా మొదలైంది- ఓ బేబి - నేనే రాజు నేనే మంత్రి సహా ఇండస్ట్రీలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల గతంలో తన కింద సహాయకులుగా పనిచేశామని చెప్పుకునే వారిపై విరుచుకుపడ్డారు. ఒక వర్ధమాన రచయిత ఇటీవల తాను భూపాల అసిస్టెంట్ రచయిత అని చెప్పుకుని నిర్మాత నుండి అడ్వాన్స్ అందుకున్నాడట.
ఆ సంగతి తెలిసిన రచయిత లక్ష్మి భూపాల.. తన పేరును వాడేస్తూ అబద్దాలు చెబుతున్నారని హెచ్చరిస్తూ తనకు అసలు ఎక్కడా శాఖలు లేవని తెలిపారు.ఘోస్ట్ రైటర్స్ లేదా సహాయకులం అని తప్పుగా చెప్పుకుంటే అలాంటి వారిని బహిరంగంగా అవమానించండి! అని హెచ్చరించాడు.
వాళ్ళని నిలువునా తోలు తీసి ఉప్పూ కారం రాసే మంచితనం నా దగ్గరున్నా.. నన్నెవరూ నిజానిజాలు అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు.. వాడేలా రాస్తాడో చూడాలి గానీ.. అలా చెప్తే ఎలా డబ్బులిచ్చారు? అని నిర్మాతలను అడిగితే ``మీ దగ్గర పని చేశాడన్న నమ్మకం!!`` అంటూ చెప్పారట. అయితే ``వాళ్లు అలా అనడం చాలా పెద్ద తిట్టు నాకు!`` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు భూపాల.
సినిమాల్లో మాటలు- పాటలు రాయడానికి ఇప్పటి వరకూ కేవలం బుర్రను తప్ప ఇంకెవరిని వాడలేదని కూడా భూపాల అన్నారు. అసిస్టెంట్ల అవసరం తనకు లేదని వెల్లడించారు. అసిస్టెంట్ లను పెట్టుకొనే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయం లో నేను మాట్లాడలేను అంటూ పంచ్ లు వేశారు.
నా పేరు వాడుకుంటున్న దరిద్రులకు ఇదే నా ప్రేమ పూర్వక అభ్యర్థన.. అమ్మలారా అయ్యలారా ఇకముందు మీరు ఇలాంటి మోసాలు కక్కుర్తి ఎదవ పనుల కోసం నా పేరు వాడినట్టు నాకు తెలిస్తే మీ తల్లిదండ్రుల మీ భార్యాబిడ్డల మీ స్నేహితుల చెప్పులతో కొట్టించి లైవ్ పెట్టించి మరీ సన్మానించబడును!! అని వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు.
అయితే ``నీ స్వార్థం కోసం పక్కోడి పేరు ను వాడుకోవడం కంటే అంగమార్పిడి చేయించుకోవడం మంచిది`` అంటూ ఫైరయ్యారు. నాకు బ్రాంచీల్లేవ్ ఎవరినీ నమ్మొద్దని లక్ష్మీ భూపాల అన్నారు.
నందిని రెడ్డి తెరకెక్కించిన సినిమాలకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల ప్రస్తుతం సంతోష్ శోభన్- మాళవికా నాయర్ నటించిన `అన్నీ మంచు శకునములే` చిత్రానికి రాస్తున్నారు. తేజ సజ్జా హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న `అద్భుతం` చిత్రానికి కూడా ఆయన రాస్తున్నారు.
ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?
పరిశ్రమలో కొందరు అసిస్టెంట్లు ఐదారు నెలల పాటు ఎవరైనా సీనియర్ రైటర్ దగ్గర పని చేసినా ఆ పేరును వాడేస్తూ అడ్వాన్సులు అందుకున్న ఘటనలు ఇదివరకూ ఉన్నాయి. అయితే పేరు వాడుకుంటే ఇక్కడ సరిపోదు. బుర్రవాడి సత్తా చూపించేవాళ్లే మనుగడ సాగించగలరు. మ్యానిప్యులేషన్ అనేది క్రియేటివిటీ రంగంలో ఎల్లకాలం సాగదు. తాము క్రియేటివిటీ చూపిస్తూ క్రియేటర్లను ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ చెల్లుతుంది. అసిస్టెంట్ గా పని చేసినా జీతాలు చెల్లించనప్పుడు చాలామంది అసిస్టెంట్లు సీనియర్ పై రివర్స్ అయ్యే సన్నివేశాలు కూడా పరిశ్రమలో లేకపోలేదు.