Begin typing your search above and press return to search.

గాంధీ స్పూర్తి అని చెప్పిన బాహుబలి రైటర్..!

By:  Tupaki Desk   |   21 Nov 2022 4:31 AM GMT
గాంధీ స్పూర్తి అని చెప్పిన బాహుబలి రైటర్..!
X
గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల రైటర్ విజయేంద్ర ప్రసాద్ తనకు గాంధీ స్పూర్తి అని చెప్పారు. నవంబర్ 20 నుంచి 28 వరకు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభానికి రైటర్ విజయేంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయారు. ఇక ఈ వేడుకలో హోస్ట్ విజయేంద్ర ప్రసాద్ ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. రైటర్స్ వల్లే నటులు, యాంకర్ లు మనుగడ సాగుతుంది.. కాబోయే రైటర్లకు మీరు ఎలాంటి సలహా ఇస్తారని ఆయన్ని అడిగారు.

అందుకు ఆన్సర్ గా విజయేంద్ర ప్రసాద్ 100 రూపాయల నోటు చూపించి నాకు గాంధీ స్పూర్తి అని అన్నారు. అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్న ఆలోచనతో విజయేంద్ర ప్రసాద్ అలా 100 రూపాయలను చూపించారని అక్కడ వారికి అర్ధమైంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఆన్సర్ కు అక్కడ ఉన్న అతిథులు క్లాప్స్ కొట్టారు.

ఎప్పటి నుంచో రైటర్ గా పనిచేస్తున్నా బాహుబలి ముందు వరకు కేవలం తెలుగు రైటర్ గానే ముద్ర వేసుకున్న విజయేంద్ర ప్రసాద్ బాహుబలి తర్వాత ఆయన పేరు మారుమ్రోగింది. అప్పుడే సల్మాన్ ఖాన్ తో బజరంగి భాయ్ జాన్ సినిమాకు కథ అందించడంతో నేషనల్ వైడ్ గా విజయేంద్ర ప్రసాద్ పాపులర్ అయ్యారు.

తన కథలతో తనయుడు రాజమౌళి చేస్తున్న అద్భుతాలు అన్ని ఇన్ని కావు. రాజమౌళి లైన్ చెబితే తను కథ రాయడం.. లేదా తన మనసుకు నచ్చిన లైన్ రాజమౌళికి చెప్పడం జరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి తన రైటింగ్ సత్తా ఏంటో చూపించిన విజయేంద్ర ప్రసాద్ త్వరలో మహేష్ తో చేయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఇప్పటికే రాజమౌళి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న హింట్స్ ఇస్తున్నాడు. అయితే పూర్తి కథ మాత్రం ఇంకా సిద్ధం కాలేదని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ కూడా మహేష్ సినిమా కథ గురించి ఎలాంటి లీకులు ఇవ్వట్లేదు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ 2022 అవార్డ్ ప్రకటించింది. ఈ అవార్డ్ వేడుకలకు అజయ్ దేవగన్ ఇంకా మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్ స్పీచ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.