Begin typing your search above and press return to search.
రైటర్లవ్వాలంటే ఫ్యాక్టరీలో దూరాల్సిందే
By: Tupaki Desk | 7 July 2015 4:50 AM GMTటాలీవుడ్‌లో ఎవరి అడ్డా వారిది. ఎవరి దుకాణం వారిది. ప్రతి దుకాణంలో కొన్ని గమ్మత్తయిన విషయాలుంటాయి. అయితే ఇక్కడికి రచయిత అవ్వాలని వచ్చేవాళ్లకు ఈ అడ్డాల్లోకి దారి ఎలా దొరుకుతుంది? ఇది తెలియక చాలామంది తికమకలోనే బతికేస్తుంటారు. కృష్ణానగర్, ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉంటారు. ఏళ్లు గడిచినా ఎప్పటికీ దారి అనేదే కనిపించదు. అసలు ఆఫీసు గుమ్మం వరకూ కూడా వెళ్లలేరు కొందరైతే. అనామకంగా వెళితే గేటు దగ్గర సెక్యూరిటీయే బైటికి గెంటేస్తాడు. అయితే అలాంటి వాళ్లకు ఇదో విలువైన సమాచారం.
మీ దగ్గర బోలెడంత క్రియేటివిటీ ఉందని మీరనుకుంటే మీకు కొన్ని అడ్డాలు అవకాశాలిస్తాయి. రచయితలుగా నిరూపించుకునే వరకూ ఘోస్టులుగానే పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి ఓ మూడు అడ్డాల వివరాలు ఇలా ఉన్నాయి. శంకులో పోస్తేనే తీర్థం అవుతుందని చెప్పాడు స్టార్ రైటర్ కోన వెంకట్. అది నిజమే. ఎంతో మంది రచయితలు కథలు వినిపిస్తామంటే పెడచెవిన పెట్టేసే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అందుకే ఎవరైనా కొత్త కుర్రాళ్లు కోనని కలిస్తే అతడు నిరాశపరచ కుండా అవకాశం ఇస్తాడు. అయితే సదరు రచయిత వద్ద నిజంగా విషయం ఉండాలి. ఓపిక, సహనం ఉండాలి. నిరూపించుకునే వరకూ పైసలుండవు. తిండి పెడతారు. మందు పోస్తారంతే. నిత్యం సినిమాలు చూసి ఎనాలిసిస్‌లు చెప్పాలి. కథా చర్చల్లో పాల్గొనాలి. సీన్లు వేయగలగాలి. ఆ సత్తా ఉన్నవాళ్లకే అవకాశం. నిరూపించుకున్న తర్వాత రాజభోగమే.
కోన అడ్డా నుంచి ఇప్పటికే బోలెడుమంది రచయితలు బైటికొచ్చారు. శ్రీధర్ సీపాన, అనీల్ రావిపూడి, గోపిమోహన్ ఇలా ఎందరో రచయతలు కోన వద్ద ఎదిగినవారే. అలాగే టాలీవుడ్‌లోనే ఉన్న మరో స్టార్ రైటర్ వక్కంతం వంశీ వద్ద కూడా ఓ అడ్డా ఉంది. అతడు ఔత్సాహిక రచయితల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. నిజంగా విషయం ఉంది అనిపిస్తే అతడికి పక్కాగా జీతం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఫుడ్డింగ్, బెడ్డింగ్ వసతులు కల్పిస్తాడు. పనిలో సిన్సియారిటీని చూస్తాడంతే.
ఇక స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కూడా రచయితలు స్టాక్ ఉంటారు. రకరకాల సినిమాల్ని చూసి ఎనాలిసిస్‌లు చేస్తుంటారు వీళ్లంతా. టీమ్ పక్కాగా పనిచేస్తుంది. బోలెడంత పరిశోధన చేసి లైబ్రరీని క్రియేట్ చేస్తారంతా. అందులోంచి మెరికల్లాంటి కుర్రాళ్లు ఇచ్చే ఐడియాలను కావాల్సిన విధంగా విజువలైజ్ చేసుకునే సత్తా పూరీకి ఉంది. అలాగే రచయితలకు సకల భోగాలు అందుబాటులో ఉంటాయి. అయితే పూరీని మెప్పించాలంటే పూరీని మించిన ఫైర్‌తో రచయితలు ఉండాలి. ఇలా ఒక్కో అడ్డాలో ఒక్కో రకం. ఉపాధి కావాల్సినవాళ్లకు కావాల్సినంత. రైటర్ అవ్వాలంటే ఫ్యాక్టరీలో దూరాల్సిందే. అయితే పక్కా ట్యాలెంట్ తప్పనిసరి.