Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల‌తో రైట‌ర్ల‌కి తిప్ప‌లే!

By:  Tupaki Desk   |   13 Nov 2022 2:30 AM GMT
స్టార్ హీరోల‌తో రైట‌ర్ల‌కి తిప్ప‌లే!
X
తెలుగు సినిమా గ‌మ‌నం మారిన త‌రుణ‌మిది. టాలీవుడ్ కొత్త చ‌రిత్ర లిఖిస్తుంది. ప్రాంతీయ భాష నుంచి పాన్ ఇండియాలో వెలుగుతోన్న సంద‌ర్భ‌మిది. 100 కోట్ల నుంచి 1000...2000 కోట్ల వ‌సూళ్లు సాధించే ఇండ‌స్ర్టీగా వృద్దిలోకి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌. ఇండ‌స్ర్టీ ఇలా ఎద‌గ‌డంలో 24 శాఖ‌ల పాత్ర ఎంతో కీల‌క‌మైన‌దిగా చెప్పాలి. ముఖ్యంగా హీరోల శైలిలో మార్పులు..ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌ల క‌థ‌ల్లో మార్పులు వంటివి ప‌రిశ్ర‌మ ఎదుగుద‌ల‌కు ప్ర‌ధానంగా దోహ‌ద ప‌డిన అంశాలు.

'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్'..'కార్తికేయ‌-2' లాంటి సినిమాలు తెలుగు సినిమాని శిఖ‌రాగ్రాన్న‌ నిల‌బెట్టిన గొప్ప చిత్రాలుగా చెప్పుకుంటాన్నామంటే..వాటి వెనుక ఎంతో కృషి ఉంద‌న్న‌ది వాస్త‌వం. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో స్టార్ హీరోల్ని క‌థ‌ల‌తో మెప్పించ‌డం ఆషామాషీ కాద‌ని తెలుస్తోంది. అందుకు స‌జీవ సాక్షాలుగా స్టార్ హీరోల చిత్రాలు ఆన్ సెట్స్ కి వెళ్ల‌కుండా డిలే జ‌ర‌గ‌డాన్నే చెప్పొచ్చు.

ఎస్ ఎస్ ఎంబీ 28వ సినిమా విష‌యంలో ఎలాంటి జాప్యం చోటు చేసుకుందో తెలిసిందే. త్రివిక్ర‌మ్ ఎన్నో వెర్ష‌న్స్ వినిపించిన త‌ర్వాత గానీ మ‌హేష్ ఒకే చేయ‌లేదు. ఆ త‌ర్వాత అవ‌స‌రమైన మార్పులు త‌ప్ప‌లేదు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ 30వ సినిమా విష‌యంలో చోటు చేసుకున్న జాప్యం క‌ళ్ల‌ముందు క‌నిపిస్తూనే ఉంది.

ప్రాజెక్ట్ ఒకే అయినా ఇంత వ‌ర‌కూ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాలేదు. ఇంకా క‌థ‌లో కొత్త ద‌నం కొర‌వ‌డింద‌ని కొర‌టాల‌ని టైగ‌ర్ సాన‌బెడుతున్నాడు. అలాగే ప్ర‌భాస్-మారుతి ప్రాజెక్ట్ విష‌యంలోనే ఇలాంటి డైల‌మానే కొన‌సాగుతుంది. కంగారు ప‌డి ఒకే చెప్పినా? ఆ సినిమా చేయాలా? వ‌ద్దా? అన్న సందిగ్దంలో ప‌డ్డాడు డార్లింగ్. ఇలా ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌లే హీరోల‌తో నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

వాళ్ల‌ని త‌మ క‌థ‌ల‌తో మెప్పించ‌లేక ..సంతృప్పి చెందించ‌లేక అతి క‌ష్టం మీద సినిమాలు చేస్తున్నారు. ఇక కేవ‌లం ర‌చ‌యిత‌గా అనుభ‌వం లేక‌..కేవ‌ల ద‌ర్శ‌కుడిగానే బాధ్య‌త‌లు వ‌హించే వారి స్థితి గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ హీరోలు అలాంటి వాళ్ల‌ని క‌నీసం ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌డం లేద‌ని కొన్ని సంకేతాలు అందుతున్నాయి.

రైటింగ్ క‌మ్ డైరెక్ట‌ర్ గా అపార అనుభ‌వం ఉంటే త‌ప్ప కొత్త వారితో సినిమాలు చేసే ప‌రిస్థితి లేదు. ఇక వ్య‌క్తిగ‌తంగా ర‌చయిత‌లు హీరోల‌తో పెద్ద సావ‌స‌మే చేయాల్సి వ‌స్తోందిట‌. తాము రాసిన‌ వెర్ష‌న్స్ ఓ ప‌ట్టాన మెప్పించ‌లేఎపోతున్నాయ‌ని...ర‌క‌ర‌కాల వెర్ష‌న్స్ రాసినా బెట‌ర్ మెంట్ అంటూ సాన‌బెడుతున్నార‌నే టాక్ వినిపిస్తుంది. దీంతో క్రియేటివ్ ప‌రంగా కొన్ని డిఫ‌రెన్సెస్ సైతం త‌లెత్తుతున్నాయ‌ని.. అయినా త‌ప్పక‌ హీరోల‌తో రాజీ ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని గుస గుస వినిపిస్తుంది.

ఇటీవ‌లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'జెర్సీ' ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ముందు ఒకే చె ప్పి..ఆ త‌ర్వాత హ్యాండ్ ఇచ్చాడు. అంత‌కు ముందు కొర‌టాల శివ విష‌యంలోనే చ‌ర‌ణ్ ఇలాగే చేసారు. ఆ సినిమా ఏకంగా లాంచ్ చేసి మ‌రీ ప‌క్క‌న‌బెట్టేసారు. మ‌రోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప‌-2' రిలీజ్ వ‌ర‌కూ కొత్త సినిమా మాటే లేదంటున్నారు. ఇంకా పేరున్న చాలా మంది హీరోలు ఇలాగే క‌నిపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.