Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాలో రెజ్లర్ ఖలీ
By: Tupaki Desk | 30 Jan 2019 6:09 AM GMTయూత్ విపరీతంగా ఇష్టపడే రెజ్లింగ్ క్రీడలో భారతీయుల్లో విశేషమైన ఫాలోయింగ్ దక్కించుకున్న ది గ్రేట్ ఖలీ తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేయబోతున్నాడు. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న నరేంద్ర అనే సినిమా ద్వారా ఇతని పరిచయం జరగనుంది. నీలెష్ ఈతి-ఇజాబెల్లె లెయితి జంటగా నటిస్తున్న ఈ మూవీ ఇండియా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా నడిపించే ఈ కథలో హీరో బాక్సింగ్ ఛాంపియన్. దీని ద్వారానే రామ్ సంపత్ అనే కొత్త సంగీత దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.
అయితే ది గ్రేట్ ఖలీ పాత్ర ఏమిటి అనే వివరాలు మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. ఖలి సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు. హాలీవుడ్ సినిమాలతో పాటు సుప్రసిద్ధ అమెరికా టెలివిజన్ షోస్ లో ఇతను చాలా చురుగ్గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఫాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. లాంగెస్ట్ యార్డ్-గెట్ స్మార్ట్ లాంటి ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇతనికి పేరు తీసుకొచ్చాయి. జయంత్ సి పరాంజీ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా చిరంజీవితో బావగారు బాగున్నారా లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు ప్రభాస్ ను ఈశ్వర్ రూపంలో తెరకు పరిచయం చేసింది కూడా జయంతే. ఆ మధ్య గంటా శ్రీనివాసరావు అబ్బాయి హీరోగా ఓ సినిమా చేస్తే ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నరేంద్ర మాత్రం ఇంతకు ముందు తెలుగులో రాని బ్యాక్ డ్రాప్ లో కొత్త తరహా స్క్రీన్ ప్లే తో రూపొందుతోందట. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నరేంద్రను కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ కోసం ఇస్లాం దేశాల్లో కూడా షూట్ చేయబోతున్నారు.ఈశాన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న నరేంద్ర విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది