Begin typing your search above and press return to search.
ఆమె మరణంతో షాక్ లో రెజ్లింగ్ ప్రపంచం
By: Tupaki Desk | 8 Oct 2022 4:28 AM GMTఅతి పిన్న వయసులో రెజ్లర్ గా రాణించి ధీటైన రెజ్లర్లను మట్టి కరిపించి ట్రోఫీని గెలుచుకున్న సాహసిగా సారా లీ పాపులరయ్యారు. అమెరికన్ టెలివిజన్ ప్రెజెంటర్ గా పాపులర్ రెజ్లర్ గా సారా లీ సుపరిచితం.
కానీ ఇంతలోనే విచారకర వార్త వినాల్సి వచ్చింది. WWE మాజీ రెజ్లర్ సారా లీ 30 ఏళ్ల వయసులో మరణించారు. సారా లీ తల్లి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించి విచారం వ్యక్తం చేసారు.
"మా సారా వెస్టన్ జీసస్ తో కలిసి ఉండడానికి వెళ్లినట్లు మేము బరువెక్కిన హృదయాలతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. మేమంతా షాక్ లో ఉన్నాం. ఏర్పాట్లు పూర్తి కాలేదు. గౌరవపూర్వకంగా మా కుటుంబానికి సంతాపం తెలియజేయాలని మేము కోరుతున్నాము" అని కుటుంబీకులు తమ విచారం వ్యక్తం చేసారు.
సారా లీ మరణం రెజ్లింగ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె 2015లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (WWE) రియాలిటీ పోటీ సిరీస్ టఫ్ ఎనఫ్ ను గెలుచుకుంది. తన సహచర రెజ్లర్లు నిక్కీ ఏఎస్ జే .. చెల్సియా గ్రీన్ సారా లీ కుటుంబానికి తమ హృదయపూర్వక నివాళిని పోస్ట్ చేసారు.
WWE అధికారిక హ్యాండిల్ లో సారా లీ మరణంపై విచారం వ్యక్తమైంది. "సారా లీ మరణించిన విషయం తెలుసుకున్నందుకు బాధగా ఉంది. మాజీ 'టఫ్ ఎనఫ్' విజేతగా లీ క్రీడా-వినోద ప్రపంచంలో అనేకమందికి ప్రేరణగా నిలిచారు.
డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ఆమె కుటుంబ సభ్యులకు స్నేహితులకు అభిమానులకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తోంది" అని పేర్కొన్నారు. 2015-16 సీజన్ లో సారా లీ ఛాంపియన్ గా అవతరించి రెజ్లింగ్ ప్రపంచంలో సంచలనంగా మారారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.