Begin typing your search above and press return to search.
20 రోజుల్లో సినిమా పూర్తి చేశారా?
By: Tupaki Desk | 20 Dec 2021 2:30 AM GMTఅరుణ్ ఆదిత్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ బ్యానర్ పై డా. రవిప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించయారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం `సోలీలివ్`లో అ నెల 24న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాఘురామ కృష్ణంరాజు, హీరో డా. రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎంపీ రఘురామ కృష్ఱంరాజు మాట్లాడుతూ `ఈ సినిమా నిర్మాత రవి గారు ఓ ఇంజనీర్. కానీ ఆయనకు సినిమా పట్ల, సాహిత్యం పట్ల ఎంతో ప్రేమ వుంది. నాక్కూడా సినిమాలు, సాహిత్యం అంటే ఇష్టం. కానీ నేను సినిమాలు తీయలేకపోయాను. ఆయన తీశారు. బ్యానర్ లోగో అద్భుతంగా వుంది. సినిమా కూడా అలానే వుండబోతోంది. శివాని రాజశేఖర్ గారు అద్భుతం సినిమాలో ఎంతో బాగా నటించారు. అదిత్ కూడా ఈ సినిమా తరువాత వేసే స్థాయి చేరుకుంటాడు. విజనరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ కలిసి చేసినన ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది` అన్నారు.
గుహన్ వండర్ ఫుల్ టెక్నీషియన్. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్ గా వస్తోందని చెప్పారు. ఇప్పడు కరెక్ట్ సమయానికి వస్తోంది. ఇంకా చూడలేదు. త్వరలోనే చూస్తాను. గుహన్ గారిలో కలిసి పనిచేయాలని అనుకుంటున్నా. గరుడవేగతో అరుణ్‌తో పరిచయం ఏర్పడింది. తను మా ఫ్యామిలీ మెంబర్. ఈ సినిమా గుర్తొచ్చినప్పుడు జీవితంలో నాకు కొన్ని గుర్తుకొచ్చాయి. ఈ టీమ్ వల్లే శివానికి కోవిడ్ సోకింది. తన వల్ల నాకు సోకింది. నా వల్ల డాడీకి వచ్చింని శివానీ బాగా ఏడ్చేసేది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను` అని డా. రాజశేఖర్ తెలిపారు.
ఒక్క షాట్ కూడా అశ్లీలంగా వుండొద్దని అన్నారు. ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను నిర్మించారు నిర్మాత. 24న చిత్రం రాబోతోంది. సోనీ లివ్ సంస్థ కుథ్యాంక్స్ . ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. సినిమా కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్ గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా అద్భుతంగా ఉండబోతోంది` అని రాజశేఖర్ జీవిత తెలిపారు.
దర్శకుడు కెవి గుహన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. జీవిత, రాజశేఖర్ నన్ను ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. పూర్తిగా వెబ్ క్యామ్‌లో సినిమా తీశాం. కరోనా, లాక్ డౌన్ సమయంలో తీశాం. బతుకుతామో లేదో అనే స్థితిలో ఉండేవాళ్లం. అప్పుడు పుట్టిన భయంలోంచే ఈ కథ వచ్చింది. ఎక్కడో దూరంలో ఉన్న నా కూతురు కష్టాల్లో వుంటే ఎలా అని అనుకున్నా. అక్కడి నుంచి కథ వచ్చింది. ఎక్కడో దూరంలో వున్న నా కూతురు కష్టాల్లో వుంటే ఎలా అనుకున్నా. అక్కడి నుంచి కథ ముందుకు వచ్చింది. తక్కువ మందితోనే షూటింగ్ చేశాం. ఆన్ లైన్ లోనే నిర్మాత రవిగారు కథ విన్నారు. ఈ కథను నమ్మి మా మీద ఖర్చు పెట్టారు. ఆదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యా` అని తెలిపారు.
సినిమాని జీవిత, రాజశేఖర్ ముందుండి నడిపించారని, కేవీ గుహన్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు నిర్మాత రవిప్రసాద్ రాజు దాట్ల. ఇండస్ట్రీ కష్టకాలంలో వుంది. ఇలాంటి సమయంలో మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నాం. మంచి టీం ఉందనే ధైర్యంతో మొదలుపెట్టాను. ఇండస్ట్రీ గురించి బయట ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా మంచి వారున్నారు. సినిమా చూసి దిల్ రాజు, సురేష్ బాబు మెచ్చుకున్నారు. సోనిలివ్‌లో ఈ నెల 24న విడుదల కాబోతోంది` అని పేర్కొన్నారు.