Begin typing your search above and press return to search.

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 'WWW'

By:  Tupaki Desk   |   25 Aug 2021 11:30 AM GMT
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో WWW
X
'118' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్.. ఇప్పుడు ''WWW'' (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) అనే మిస్టరీ థ్రిల్లర్‌ ను రూపొందిస్తున్నారు. ఇందులో అదిత్ అరుణ్‌ - శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వి ప్రసాద్ రాజు ద‌ట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంతో ఈ చిత్రాన్ని థియేట‌ర్లలో విడుదల చేయడానికి డీల్ కుదుర్చుకున్నారు.

ఈ సందర్బంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సురేష్‌ బాబు మాట్లాడుతూ.. ''ఇటీవలే ఈ సినిమా చూశాను. క్రిస్పీ నేరేష‌న్‌ తో మంచి పెర్‌ఫామెన్స్‌ ల‌తో చాలా థ్రిల్లింగ్ గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, వర్చువల్ వరల్డ్ లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు. అంత‌ర్లీనంగా ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉంది. ఆడియోకి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది'' అని అన్నారు.

'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' నిర్మాత రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ.. ''మా బేన‌ర్‌ లో రూపొందిన మొదటి చిత్రానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో వస్తోన్న ఫస్ట్ కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది. గుహ‌న్‌ మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది'' అని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కేవీ గుహన్ మాట్లాడుతూ.. ''సినిమా చాలా బాగా వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ రిలీజ్ అవుతుండటం నిజంగా హ్యాపీగా ఉంది. అదిత్‌ - శివాణి చాలా బాగా న‌టించారు. సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు. ఇది తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది'' అని చెప్పుకొచ్చారు.

కాగా, ''WWW'' చిత్రంలో వైవా హర్ష - దివ్య దృష్టి - ప్రియదర్శి - సత్యం రాజేష్ - రియాజ్ ఖాన్
ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి మిర్చి కిర‌ణ్ డైలాగ్స్ రాస్తున్నారు. దర్శకుడు కేవీ గుహన్ స్క్రీన్ ప్లే తో పాటుగా సినిమాటోగ్రఫీ అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.