Begin typing your search above and press return to search.
కాళ్లతో తొక్కి..స్టేషన్ లో వేసి..నటవారసుడి పాట్లు
By: Tupaki Desk | 25 Sep 2019 10:03 AM GMTఒక స్వచ్ఛమైన ప్రేమికుడిలోని ఎమోషన్ ని చూపించేందుకు ఒక పాట ఎంతగా వర్కవుటవుతుందో అర్జున్ రెడ్డి చూశాక చాలామందికి అర్థమైంది. ఆ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రతి పాటా ఎమోషన్ తో అలరించాయి. అందుకే అంత పెద్ద హిట్టయ్యింది. నిజాయితీ ఉన్న ప్రేమికుడి అంతు లేని ఆవేదన తెరపై కనిపించింది. అదే ఫ్యాక్టర్ హిందీ వెర్షన్ కబీర్ సింగ్ సక్సెస్ కి సాయమైంది. అయితే అలాంటి మ్యాజిక్ తమిళ వెర్షన్ ఆదిత్య వర్మతో వర్కవుటవుతుందా? అక్కడ ఒక డెబ్యూ కథానాయకుడి ప్రయత్నం సఫలమవుతుందా? అంటే.. ఇదిగో ఈ వీడియో సాంగ్ ని వీక్షించి ఆడియెన్ నిర్ణయించుకోవచ్చు.
`ఏన్ ఎన్నయ్ ఫిరిందై..` అనే పాట నిన్ననే రిలీజైంది. కానీ దానిని ఎవరూ అంతగా గుర్తించలేదు. ఒరిజినల్ వర్షన్ `అర్జున్ రెడ్డి`తో పోల్చి చూడకపోతే ఈ పాట ఆకట్టుకుంది. ధృవ్ తొలి చిత్ర కథానాయకుడిగా అయినా డీసెంట్ గానే కనిపించాడు. ఆ పాటలో ఒక ప్రేమికుడి బాధ విరహవేదనను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. ఎమోషన్ పండింది. కాళ్లతో తొక్కి.. స్టేషన్ లో వేసి.. స్టార్ కిడ్ పాట్లు ఏమిటి? అన్న ఆవేదన కలుగుతోంది. ఈ పాటే తెలుగు- హిందీ వెర్షన్ల సక్సెస్ కి సాయమైంది. తమిళ వెర్షన్ లోనూ టెస్ట్ పాసైనట్టేనని అర్థమవుతోంది.
ఇంకా `ఆదిత్య వర్మ` చిత్రంలో ఎన్ని ఛమక్కులు ఉన్నాయి? కొత్త కుర్రాడు ఎలా నటించాడు? అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. ఒకసారి ఇప్పటికే సినిమా మొత్తం షూట్ చేసి ఒక స్టార్ డైరెక్టర్ ని అవమానించి.. రిలీజ్ ఆపేసి.. ఇలా చాలానే జరిగింది ఈ సినిమా విషయంలో. అయితే గత గాయాల్ని మాన్పాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టి తీరాల్సిన సన్నివేశం ఉంది. చియాన్ విక్రమ్ వారసుడి పరిచయం కోసం చాలానే ఆత్రపడుతున్న సంగతి అర్థమవుతోంది. అయితే పదే పదే ఏదో ఒక రకంగా ఆలస్యమవుతుంటే మాత్రం అది నటవారసుడికి ఇబ్బందికర పరిస్థితేనని చెప్పాలి. అలాంటి సన్నివేశం లేకుండా సాఫీగా అన్నీ సాగాలని ఆకాంక్షిద్దాం. ఈ చిత్రంలో బానిటా సంధు కథానాయికగా నటిస్తోంది.