Begin typing your search above and press return to search.
నా భార్య అబార్షన్ కు, ఆమెకు సంబంధం లేదు
By: Tupaki Desk | 11 July 2016 5:30 PM GMTరూమర్ అనుకున్నది నిజమే అని తేలిపోయింది. బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ తన భార్య నుంచి విడిపోవడం ఖాయమని తేలిపోయింది. ఈ వ్యవహారంలో హీరోయిన్ యామి గౌతమ్ పేరు బాగా చర్చనీయాంశం అవుతోంది. పులకిత్ తో కలిసి యామి ‘సనమ్ రే’ సినిమా చేయడంతోనే అతడి వివాహ బంధం బీటలు వారడం మొదలైందని బాలీవుడ్ మీడియా కోడై కూసినపుడు జనాలు లైట్ తీసుకున్నారు కానీ.. ఈ మధ్య పులకిత్ భార్య శ్వేతనే స్వయంగా తమ కాపురంలో యామి చిచ్చుపెట్టిందంటూ మీడియా ముందుకొచ్చేయడంతో పులకిత్-యామిల మధ్య ఏం జరుగుతోందో అందరికీ అర్థమైంది.
తనకు అబార్షన్ జరగినప్పటి నుంచి పులకిత్ తనను దూరం పెట్టి.. యామికి దగ్గరయ్యాడంటూ శ్వేత ఆరోపించింది. యామి మీద ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఐతే శ్వేత ఆరోపణలపై ఎట్టకేలకు పులకిత్ స్పందించాడు. శ్వేత తన గురించి.. యామి గురించి చెబుతున్నవన్నీ కట్టుకథలేనని.. సానుభూతి కోసమే ఆమె ఈ ఆరోపణలు చేస్తోందని అతను ఆరోపించాడు. ఇకపై శ్వేతతో కలిసి ఉండటం ఎప్పటికీ సాధ్యం కాదని అతను స్పష్టంచేశాడు. ‘‘శ్వేతకి అబార్షన్ జరిగి నాలుగేళ్లయింది. అప్పట్లో మేమిద్దరం చాలా బాధపడ్డాం. వాస్తవం ఏంటంటే.. అప్పటికి యామితో నాకు పరిచయమే జరగలేదు. ఇప్పటిదాకా నా గురించి.. యామి గురించి ఎవరేం మాట్లాడినా సహించాను. కానీ ఇప్పుడు మాట్లాడక తప్పట్లేదు. శ్వేత నా ప్రతిష్టను దెబ్బ తీస్తోంది. వ్యక్తిగత విషయాల్ని రచ్చ చేసి బజారుకీడుస్తోంది. ఆమె ఇలా ప్రవర్తిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సానుభూతి కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. మా బంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం నేను చాలా చేశాను. కానీ ఆమే ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగింది. ఇక ఆమెతో తిరిగి కలిసే ప్రసక్తే లేదు’’ అని పులకిత్ తేల్చి చెప్పాడు.