Begin typing your search above and press return to search.

ఈవెంట్స్ కి వెళ్లడానికి ఇబ్బంది పడిందట

By:  Tupaki Desk   |   18 May 2018 7:01 AM GMT
ఈవెంట్స్ కి వెళ్లడానికి ఇబ్బంది పడిందట
X
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ యామి గౌతమ్. ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చాక అమ్మడు హీరోయిన్ గా అవకాశాలు బాగానే వచ్చినా తన అందంతో పెద్దగా హిట్స్ అందుకోలేదు. బాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేసే గ్లామర్ ఉన్నప్పటికీ తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. అందులో ఏ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక బాలీవుడ్ లో ఒకానొక దశలో వరుసగా ఆఫర్స్ అందడంతో అమ్మడి కెరీర్ కొంచెం ఊపందుకుందని అంతా అనుకున్నారు.

కానీ విక్కీ డోనర్ సినిమా తరువాత పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయింది. వరుస డిజాస్టర్స్ యామి కెరీర్ ను దెబ్బ కొట్టినట్లు అనిపించింది. 28 ఏళ్ల బ్యూటీ ఒక్క బాక్స్ ఆఫీస్ హిట్టు చూడకుండానే వెనుతిరుగుతోందని కామెంట్స్ వచ్చాయి. దీంతో యామి ఒక సందర్భంలో సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడిందట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ఆ విషయాన్ని తెలిపింది. అంతే కాకుండా తను ఎలా రికవర్ అవ్వాలో కూడా యామి నేర్చుకుందట.

తన కుటుంబ సభ్యులు తన కెరీర్ కు బాసటగా నిలిచారని ఫెయిల్యూర్స్ వచ్చిన సమయంలో నిరాశకు చెందకుండా ఎలా పికప్ అవ్వాలనే దానిపై ధైర్యం ఇచ్చారని ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ వివరించింది. ప్రస్తుతం యామి గౌతమ్ చేతిలో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నట్లు తెలుస్తోంది. పరభాషాల నుంచి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నప్పటికీ తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే ఒకే చేస్తోందట ఈ బ్యూటీ.