Begin typing your search above and press return to search.
కవర్ పేజీ పోజులతో కిక్కిస్తున్న గ్లామర్ బ్యూటీ..!!
By: Tupaki Desk | 19 Aug 2020 9:50 AM GMTగ్లామర్ బ్యూటీ యామీగౌతమ్.. పేరు సౌత్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమా హీరోయినుగా తక్కువ తెలిసినా "ఫెయిర్ అండ్ లవ్లీ" బ్యూటీగా మాత్రం అందరికి సుపరిచితమే. గౌరవం సినిమాతో హీరోయినుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ఆ తర్వాత కొన్నాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీకి అంకితమై.. మళ్లీ నితిన్ సరసన 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు వైపు చూడలేదు యామి. ఇక బిలాస్పూరులో పుట్టిన ఈ భామ చండీఘర్ లో పెరిగిందట. ఇక యామి తండ్రి ముకేశ్ గౌతమ్ బేసిగ్గా పంజాబీ ఫిల్మ్ డైరెక్టర్ కావడంతో అమ్మడికి సినిమాల వైపు ఆసక్తి కలిగిందట. లా డిగ్రీ పొందిన ఈ భామ తన 20యేళ్ళ వయసులో యాక్టింగ్ వైపు రావాలని ముంబైకి మకాం మార్చింది. ఇక 'చాంద్ కే పార్ ఛలో'.. 'యే ప్యార్ న హోగా కం' టీవీ సిరీస్ లతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక 2009లో 'ఉల్లాస ఉత్సాహ' సినిమాతో హీరోయినుగా తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2012లో 'విక్కీడోనార్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా యామీగౌతమ్ కు ఫస్ట్ హిట్ అందించింది. ఆ సినిమాకి అమ్మడు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది. అయితే యామికి సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ తో పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఫేర్ అండ్ లవ్లీ యాడ్ యామిని నేషనల్ వైడ్ పాపులర్ చేసింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాజాగా ఓ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటో 'ఏల్లేఇండియా' అనే సెలబ్రిటీ కవర్ పేజీ కోసమని తెలుస్తుంది. అయితే ఈ భామ ప్రస్తుతం పార్టీ చేసుకునే మూడ్ లో లేదట. "నేను యాక్టింగ్ ఆపేసినప్పుడు నిజంగా యాక్ట్ చేయలేను" అంటోంది. వీటన్నిటిని బదులు ఇంట్లోనే ఉంటూ వండుకుని తింటా.. లేదా హిమాచల్ ప్రదేశ్ లో కొన్న 100సంవత్సరాల నాటి ప్రాపర్టీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటానని అంటుందట. ఒకవేళ మీరు నైస్ గా అడిగితే మిమిక్రీ చేసి అలరిస్తా అంటుందట. అది కూడా కంగనా రనౌత్ గాత్రంలో. ఇదిలా ఉండగా.. సౌత్ లో ఈ భామకు అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో మాత్రం బాగానే పరవాలేదట. మోడలింగ్ స్టార్ట్ చేసిన యామీగౌతమ్.. ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో వైట్ టాప్ ధరించి కిక్కిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.