Begin typing your search above and press return to search.

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీకి ఛర్మ సమస్యలా!!

By:  Tupaki Desk   |   5 Oct 2021 5:36 AM GMT
ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీకి ఛర్మ సమస్యలా!!
X
హీరోయిన్ గా ఫేమస్‌ కాక ముందే యామి గౌతమ్ కమర్షియల్స్ తో ఫేమస్‌ అయ్యింది. ప్రముఖ ఛర్మ సౌందర్య క్రీమ్‌ ఫెయిర్ అండ్ లవ్లీ కి సుదీర్ఘ కాలం పాటు యామి గౌతమ్ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా చేసింది. ఫెయిర్ అండ్‌ లవ్లీ అనే పేరు వినిపిస్తే ఆమె గుర్తుకు వచ్చేంతగా ఆమెను సదరు కంపెనీ ఉపయోగించారు. ఆమె ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత అనూహ్యంగా సంస్థ యొక్క మార్కెట్‌ పరిధి పెరిగింది. అందుకే ఆమె సుదీర్ఘ కాలం పాటు ప్రమోట్ చేయడం జరిగింది.

ఫెయిర్ అండ్‌ లవ్లీకి అంబాసిడర్ గా వ్యవహరించిన యామి లా అందంగా కనిపించాలని.. ఆమెలా గ్లో స్కిన్‌ కావాలని ఎంతో మంది అమ్మాయిలు అనుకుంటారు అనడంలో సందేహం లేదు. అలాంటి స్కిన్‌ కావాలంటే ఆమె వాడే ఫెయిర్ అండ్ లవ్లీనే వాడాలని అందురు అనుకునే వారు. కాని అంత అందంగా ఉండి సుదీర్ఘ కాలం పాటు ఫెయిర్ అండ్‌ లవ్లీకి బ్రాండ్‌ అంబాసిడర్ గా ఉన్న యామి గౌతమ్ అనూహ్యంగా తన చర్మ సమస్యను బయటకు చెప్పి అందరిని ఆశ్చర్య పర్చింది.

ఇటీవల సోషల్‌ మీడియాలో తన చర్మ సమస్యల గురించి యామి గౌతమ్‌ చెప్పుకొచ్చింది. తనకు కెరాటోసిస్ పిలారిస్ అనే చర్మ సంబంధిత సమస్య ఉందని.. ఆ సమస్య కారణంగా నా మొహంపై చిన్న గడ్డలు ఏర్పడతాయి. ఆ గడ్డలను తొలగించడానికి సాధ్యం కాదు. నా టీనేజ్ నుండి ఎదుర్కొంటున్న ఈ సమస్య కు పరిష్కారం కోసం చాలా ప్రయత్నించాను. కాని ఈ సమస్యకు పరిష్కారం లేదని వైధ్యులు చెప్పారు. నేను ఇన్ని రోజులుగా పడుతున్న బాధ మరియు భయాలను వదిలించుకనేందుకు గాను బయటకు ఈ విషయాన్ని చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను అంది.

ఈ నిజంను నేను ఇన్నాళ్లు స్వీకరించి ముందుకు సాగలేక పోయాను. కాని జనాలు ప్రతి ఒక్కరు తమలో ఉన్న లోపాన్ని ఎత్తి చూడకుండా కనీసం దాన్ని గురించి ఆలోచించకుండా పనిలో పడాలి అన్నట్లుగా ఆమె సలహా ఇచ్చింది. ఎలాంటి సమస్య అయినా.. ఎప్పటికి అయినా నిజాన్ని స్వీకరించి ముందుకు సాగి పోక తప్పదు. కనుక ఈ విషయంలో నేను ఇంకా ఎక్కువగా ఆలోచించి బాధ పడాలని అనుకోవడం లేదు అంది. అయితే ఆమె చర్మ సమస్యకు ఫెయిర్ అండ్ లవ్లీ ఏమైనా కారణం ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె టీనేజ్ నుండి ఆ సమస్య ఎదుర్కొంటున్నట్లుగా ఆమె చెప్పిన సోషల్‌ మీడియా కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.