Begin typing your search above and press return to search.

కోర్టుకు వెళ్ళబోతున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   26 May 2018 4:37 AM GMT
కోర్టుకు వెళ్ళబోతున్న హీరోయిన్
X
సినిమాల్లో పేరు తెచ్చుకోవడం కోసం హీరోలైతే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొన్ని కొన్ని రోల్స్ చేయడం కోసం నిజజీవితంలోని వ్యక్తులను కలిసి వాళ్ల అనుభవాలు ఏమిటో తెలుసుకుని నాచురల్ గా కనిపించేందుకు తెగ ట్రై చేస్తుంటారు. బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ఈ విషయంలో హీరోలకే మాత్రం తీసిపోనంటోంది. సినిమాలో తన పాత్ర పర్ ఫెక్ట్ గా కనిపించడం ముందు చాలానే హోం వర్క్ చేస్తానంటోంది.

తాజాగా యామీ గౌతమ్ బత్తి గుల్ మీటర్ చాలు అనే సినిమా చేస్తోంది. ఇందులో ఆమెది లాయర్ రోల్. సాధారణంగా నల్లకోట్ వేసుకుని వచ్చి డైలాగులు చెబితే సరిపోతుందని హీరోయిన్లు అనుకుంటారు. కానీ యామీ మొత్తం షూటింగ్ మొదలయ్యేలోగా కోర్టులకు వెళ్లి లాయర్ల లైఫ్ స్టయిల్ ని స్టడీ చేయడం మొదలెట్టింది. ప్రస్తుతం కోర్టులకు సమ్మర్ సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ కు వెళ్లి మరీ న్యాయస్థానంలో విచారణ ఎలా సాగుతుందో చూసి వస్తోందట. కోర్టులు తెరిచాక ఆ ప్రొసీడింగ్స్ కూడా గమనిస్తానని చెబుతోంది.

యామీ బత్తిగుల్ మీటర్ చాలుతో పాటు యురి సినిమాలోనూ నటిస్తోంది. ఇందులో ఆమె ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. ఇందుకోసం మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోబోతోంది. ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా కనిపించడానికి ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని యామీ ఫీలింగ్. ఈ పర్ ఫెక్ట్ యాక్టింగ్ బ్యూటీ టాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించింది. అల్లు శిరీష్ తో గౌరవంలోనూ.. నితిన్ తో కలిసి కొరియర్ బాయ్ కళ్యాణ్ లోనూ కనిపించింది. ఈ రెండింటిలోనూ మామూలు అమ్మాయి రోల్స్ చేసింది. అందుకే అప్పట్లో ఇలా ట్రైనింగ్ తీసుకోవడం లాంటి ప్రయోగాలేం చేయలేదు.