Begin typing your search above and press return to search.
ర్యాంప్ పై తూలి పడబోయి!
By: Tupaki Desk | 1 Feb 2019 6:32 PM GMTసౌత్ నుంచి ముంబై పరిశ్రమకు వెళ్లి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ యామీ గౌతమ్. ఫెయిర్ & లవ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా యామీకి దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు బాలీవుడ్ లో కాబిల్ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో హృతిక్ సరసన ప్రయోగాత్మక పాత్రలో నటించి మెప్పించింది. అంధురాలైన ప్రేమికురాలిగా ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో మైమరిపించింది. కెరీర్ డెబ్యూ సినిమానే `విక్కీడోనర్` లాంటి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అందుకే యామీ కెరీర్ ఓ వెలుగు వెలుగుతోంది.
రీసెంట్ గా `బట్టి గుల్ మీటర్ చాలు` అనే ప్రయోగాత్మక చిత్రంలోనూ చక్కని పాత్రలో నటించి మెప్పించింది. రెండు వారాల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన విక్కీ కౌశల్ `ఊరి: ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంలో పల్లవి శర్మ అనే పాత్రలో నటించి మైమరిపించింది. ఇలా వన్ బై వన్.. వరుసగా హిందీలో బెస్ట్ చిత్రాల్లో నటిస్తూ యామీ అంతకంతకు క్రేజు పెంచుకుంటోంది.
అలాగే సామాజిక మాధ్యమాల్లో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటోంది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాలకు సంతకాలు చేసిన యామీ ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ తొలిరోజు ర్యాంప్ వాక్ తో అదరగొట్టేసింది. అయితే ఈ వేదికపై యామీ హైహీల్స్ ఇబ్బంది పెట్టాయి. నేలపై వేలాడుతూ పొడవుగా ఉన్న తన డ్రెస్ కి హై హీల్స్ తాకి జారి పడబోయి తమాయించుకుంది. ఈ వీడియోల్ని బాలీవుడ్ మీడియా పదే పదే లైవ్ చేస్తూ టీఆర్పీ ఆట ఆడింది. ర్యాంప్ షోల్లో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ సహజంగా చూస్తున్నదే. అయితే అలాంటిది కాదు కానీ ఆ సమయంలో యామీ ఆ ప్రమాదం నుంచి తనని తాను కవర్ చేసుకున్న తీరు ఆసక్తి కరం.