Begin typing your search above and press return to search.
సినిమాల్లోనే హీరోలా? నిజ జీవితంలో కారా?
By: Tupaki Desk | 10 Jun 2020 3:30 PM GMTసినిమాల్లో భారీ భారీ డైలాగ్‌లు చెప్పే సినీ హీరోలు నిజ జీవితంలో కనీసం మనుషుల్లాగ ప్రవర్తించడం లేదని, చిరంజీవి కూడా అలాంటి వ్యక్తేనని బీజేపీ మహిళా నాయకురాలు సాధినేని యామిని శర్మ ఆరోపించారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆమె సినీ ప్రముఖుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం జగన్‌తో భేటీ అయిన వాళ్లు పక్కాగా తమ లావాదేవీలు మాట్లాడుకోవడానికి వెళ్లారని ఆరోపించారు. సినిమా హీరోలు నిజ జీవితంలో కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించడం లేదంటూ మండిపడ్డారు.
ఇటీవల సీఎం జగన్‌తో సమావేశానికి వెళ్తున్న సమయంలో అతిథిగృహం వద్ద చిరంజీవికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు నిరసన వ్యక్తం చేయగా, అయితే వారిని పట్టించుకోకుండా చిరంజీవి వెళ్లడంపై యామిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రైతుల కోసం చిరంజీవి చూపించిన స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. సినిమాలలో భారీ డైలాగులు చెప్పి స్ఫూర్తి నింపే హీరోలు నిజ జీవితంలో కనీసం మనుషులుగానైనా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. రాజకీయంగా, నటుడిగా మంచిపేరు ఉన్న చిరంజీవి సినిమాల్లో కార్పొరేట్ వ్యవస్థపై పోరాటం చేస్తాడు కానీ నిజ జీవితంలో మాత్రం పట్టించుకోరా అని ప్రశ్నించారు. రాజధాని రైతులు ప్లకార్డులు పట్టుకుని నిలుచుంటే కనీసం వారిని పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. వారికి సినిమాలు ఆడటమే ముఖ్యమని, ఇంకేం పట్టవని పేర్కొన్నారు.
ప్రపంచంలో ప్రజలు చచ్చినా వారికి ఫర్వాలేదని, తాము మాత్రం బాగుంటే చాలు అనే ధోరణి వారిదని సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ రంగానికి చెందిన వారు అమరావతి విషయంలోనే కాదు, ఎల్జీ పాలిమర్స్ ఘటన, తిత్లీ తుఫాన్ వంటి విషయాల్లో స్పందించలేదని, ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా వారికి పట్టింపు లేదని తెలిపారు. ఇకనైనా సినీ పరిశ్రమకు చెందిన వారు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.