Begin typing your search above and press return to search.
శవాల మీద చిల్లర ఏరుకునే షో లవి- యండమూరి
By: Tupaki Desk | 10 July 2017 11:56 AM GMTఈ మధ్య టీఆర్పీల కోసం టీవీషోలను భ్రష్ఠు పట్టించేస్తున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నలుగురికి తెలిసేలా బహిరంగ చర్చకు తెస్తున్నారు. ఆ షో నిర్వహించే వ్యాఖ్యాతలు వారికి నచ్చినట్లు పంచాయితీలు చేసేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వస్తున్న అటువంటి షో లు ప్రేక్షకాదరణ పొందడం విచారకరమని ప్రముఖ రచయిత, మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.
ఈ తరహా కార్యక్రమాల్లో వాస్తవాల గురించి ఓ న్యూస్ ఛానెల్ ఆయనను ప్రశ్నించింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని యండమూరి సమాధానమిచ్చారు. మానస వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ కుటుంబ కలహాల షోలలో పాల్గొనే వారికి తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని , కేవలం పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తమను మేథావులుగా భావించుకుంటారని విమర్శించారు. తీర్పులిచ్చేవాళ్ల సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ల ఉద్దేశం ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.