Begin typing your search above and press return to search.
యండమూరి లైఫ్.. సూపర్ ఎగ్జాంపుల్
By: Tupaki Desk | 7 Aug 2015 2:17 AM GMTవిజయానికి ఐదు మెట్లు... ఈ మాట వినగానే యండమూరి వీరేంద్ర నాథ్ గుర్తురావడం సహజం. దశాబ్దాలుగా నవలా రచయితగా వెలుగొందుతున్నారు ఈయన. ఫేమస్ ఫిక్షన్ రైటర్ గా పేరు గడించిన యండమూరి రచించిన అనేక నవలలు సినిమాలుగా మారాయి. ముఖ్యంగా యండమూరి కథానాయకుడు ఎక్కువగా మెగాస్టార్ అప్పట్లో. రచయితగా టాప్ ప్లేస్ లో కూర్చున్న ఈయన కూడా.. కొన్ని విషయాల్లో విఫలం అయ్యారు. చిరంజీవి మాంచి రైజ్ లో ఉన్న టైంలోనే యండమూరికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినా... హిట్ కొట్టలేకపోయారు.
అంతకు ముందే యమున లీడ్ కేరక్టర్ గా... సొంత నవలతోనే తీసిన అగ్నిప్రవేశం పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే... నావల్ రీడర్స్ అందరూ బాగా చదువుకున్నవారే అయుంటారు. కానీ సినిమాల విషయానికొస్తే... లోక్లాస్ నుంచి హైక్లాస్ వరకూ అన్ని వర్గాలను, చదువుకోని వారిని కూడా ఎంటర్ టెయిన్ చేయగలగాలి. ఇలా మాస్ పల్స్ క్యాచ్ చేయడంతో ఫెయిలయ్యారు యండమూరి. యాక్టర్ గానూ కొన్ని ట్రయల్స్ వేసినా అవి కూడా ఫ్లాపే. విజయం సాధించడంపై లక్షలాది మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన యండమూరి కూడా... అన్నిటిలోనూ సక్సెస్ కాలేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దటీజ్ లైఫ్... అంతే...