Begin typing your search above and press return to search.

జనాల్ని చూసి నాగబాబు ఆవేశపడ్డాడు

By:  Tupaki Desk   |   7 Jan 2017 8:03 PM GMT
జనాల్ని చూసి నాగబాబు ఆవేశపడ్డాడు
X
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. యండమూరి వీరేంద్రనాథ్.. రామ్ గోపాల్ వర్మలను ఉద్దేశించి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే.. వర్మ వెంటనే సారీ చెబుతూ ట్వీట్స్ పెడుతూ నాగబాబు కి గట్టిగానే కౌంటర్ ఎటాక్ ట్వీట్స్ పెట్టాడు .. యండమూరి కూడా తన స్పందన తెలియచేశాడు.

'ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల క్రితం కోదండరామిరెడ్డి ఫోన్ చేసి.. 'ఏంటి నాగబాబు ఇట్లా మాట్లాడాడు అన్నాడు. మిమ్మల్ని చాలా బాగా తిట్టాడు అన్నాడాయన. ఏం తిట్టాడు అన్నాను. మీరు చెప్పేది చిరంజీవి తమ్ముడు నాగబాబు గురించేనా అని అడిగాను. అవును అన్నాడు. నాకు నిజంగా అర్ధం కాలా. నేను దాదాపు సినిమా ఫీల్డ్ వదిలేసి.. 10-12 ఏళ్లు అయింది. ఆ తర్వాత మొన్నామధ్య ఓ టీవీ ఫంక్షన్ లో నాగబాబు కలిశాడు.. స్టేజ్ మీద గురువుగారు మీరు స్టోరీలు ఇవ్వాలి అన్నాడు. భుజం మీద చెయ్యేశాడు' అంటూ రీసెంట్ గా జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు యండమూరి.

'చాలా క్లోజ్ గా ఉన్నాడు.. ఎందుకు జరిగిందిది.. కొంతమంది అమిగ్డాలా ఓరియెంటేషన్ పీపుల్ ఉంటారు. అంటే. వాళ్లు చాలా ప్లెయిన్ హార్టెడ్. మనసులో ఏమున్నావారు వాళ్లు ఆపుకోలేరు. బహుశా అలాంటిది ఏమన్నా జరిగిందేమో.. ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్.. ప్రజారాజ్యం పెట్టినపుడు చిరంజీవికి పాలిటిక్స్ ఏంటి.. రాజకీయాలకు పనికి రాడు అని ఒక కామెంట్ చేశాను. మొన్న ఎపుడో ఒక వ్యక్తిత్వ వికాస కోర్సులో రామ్ చరణ్ తేజ-దేవిశ్రీ ప్రసాద్ ను పోలుస్తూ.. ఇద్దరి ఫాదర్స్ నాకు బాగా క్లోజ్. అభిలాషకు కలిసి వర్క్ చేశాం సత్యమూర్తి.. చిరంజీవి. సో ఫాదర్ కాదు ముఖ్యం.. ట్యాలెంట్ ఉండాలి అని చెప్పడం.. ఎవరినీ తక్కువ చేయడం ఏం కాదు అది' అంటూ చిరు-చరణ్ లపై చేసిన కామెంట్స్ ను చెప్పాడు యండమూరి.

'మా దేవిశ్రీ ప్రసాద్ ఎలా పైకొచ్చాడో చెబుతూ కంపేర్ చేశాను. ఆ తర్వాతే నేను నాగబాబు కలిశాం. చాలా బాగా మాట్లాడాడు. చిన్నకుర్రాడు.. ఆవేశపరుడు.. రేపెపుడో మళ్లీ వస్తాడు.. గురువుగారు అంటాడు. మళ్లీ కలుస్తాం. మళ్లీ కలిసి కూడా సినిమా తీయచ్చేమో. స్టోరీస్ కావాలి గురువుగారు అన్నాడు. అంతా పానకంలో పుడకలాంటి వ్యవహారం ఇది. ఏదో ఆవేశ పడ్డాడు జనాలను చూసి అంతే. జస్ట్ ఏ స్మాల్ థింగ్ ఇది' అంటూ తన వివరణ ఇచ్చాడు రచయిత యండమూరి వీరేంద్రనాథ్.