Begin typing your search above and press return to search.
రైతు కష్టాలు తెలిసిన రియల్ హీరోస్
By: Tupaki Desk | 17 Nov 2019 7:35 AM GMTరాక్ స్టార్ యశ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. కేజీఎఫ్ అనే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. త్వరలో కేజీఎఫ్-2 తోనూ సంచలన సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే యశ్ గతం వేరు. అతని జీవితం గోల్డ్ స్పూన్ తో ముడిపడినది కాదు. పలుగు- పార పట్టి పొలం దున్నిన రైతు బిడ్డ. కష్టాలను ఎదురీది స్టార్ అయ్యాడు. చిన్నప్పుడు పొలం గట్లు.. చెట్టు పుట్టల మధ్య తిరిగిన అనుభవం ఉంది. కోతి కొమ్మచ్చి ఆడాడు. ఓ సాధారణ మధ్య తరగతి జీవితం నుంచి వచ్చిన వాడు. యశ్ తండ్రి కర్నాటకలో ఆర్టీస్ కండెక్టర్ అన్న సంగతి తెలిసిందే. అయితే అతను బస్ కండక్టర్ కావడం కంటే ముందు ఓ సాధాసీదా రైతు. అయితే తమ ప్రాంతంలో సరైన పంటలు పండకపోవడంతో యశ్ తండ్రి కండెక్టర్ గా విధుల్లో చేరాడు. అలా రైతు సమస్యలన్నీ యశ్ చిన్నప్పటి నుంచి చూసాడు. అందుకే ఇప్పుడు స్టార్ అయ్యాక రైతుల పాలిట రియల్ హీరోగా మారాడు.
యశ్ కర్ణాటకలోని తన స్వస్థలం అయిన భువన హల్లిని ఇప్పటికీ మర్చిపోలేదు. హీరో అయ్యాక ఆ గ్రామం రైతులకు వ్యవసాయానికి అసరమయ్యే వాటిని తనే ఏర్పాటు చేస్తున్నాడట. అలాగే ఉత్తర కర్ణాటకలోని తాళ్లూరులో ఓ చెరువు ఉంది. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆచెరువు పునరుద్దరణకు నడుం బిగించాడు. ఆ చెరువు మీద ఆధారపడి 25 గ్రామాల ప్రజలు నివశిస్తున్నారు. ఆ చెరువు ఆధారంగానే వ్యవసాయం చేస్తారు. కానీ 2012 నుంచి వర్షాలు లేక ఎండిపోయిందిట. దాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో విషయం యశ్ కి తెలియడంతో వెంటనే ఆ చెరువును చూసి వచ్చాడు. ఇంకా మరెన్నో చెరువులది అదే పరిస్థితి. దీంతో అక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాటి పునరుద్దరణ కోసం 2016లో యశోమార్గ పౌండేషన్ ఏర్పాటు చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని ఓ ఇంటర్వూలో యశ్ తెలిపాడు.
ఇప్పటికి వీటికోసం ఎంత ఖర్చు చేశాడు? అంటే.. దాదాపు 4 కోట్ల వరకూ చెరువులకు స్వయంగా తానే ఖర్చు పెట్టి రైతుల హృదయాల్లో రియల్ హీరో ఆయ్యాడు. ఇంకా రైతులను ఆదుకోవడం కోస హీరో విశాల్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సంగతి తెలిసిందే. తన సినిమా ప్రతీ టికెట్ నుంచి రూపాయి రైతుకి చేరేలా చర్యలు తీసుకున్నాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి వచ్చే చిత్రాల ఫంక్షన్ల విషయంలో అతిధులెవ్వరికీ పుష్ఫగుచ్చాలు ఇవ్వకూడదని నిర్ణయించాడు. ఆ ఖర్చును బాలికల చదువులకు వినియోగిస్తానని తెలిపాడు.