Begin typing your search above and press return to search.

సినీకార్మికులకు 'రాకీ భాయ్' భారీ సహాయం..!

By:  Tupaki Desk   |   2 Jun 2021 8:30 AM GMT
సినీకార్మికులకు రాకీ భాయ్ భారీ సహాయం..!
X
ప్రస్తుతం కరోనా పేరు చెబితేనే దేశం చిగురుటాకులా వణుకుతుంది. ఈ మహమ్మారి దేశ ఆర్ధిక వ్యవస్థ పై భారీ ప్రభావం చూపింది. ఇప్పటికే ప్రభుత్వాలు అమలు పరిచిన లాక్డౌన్ నిబంధన మేరకు.. దేశంలో అన్ని వ్యాపారాలు - పనులు ఎక్కడిక్కడ స్థంభించి జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా మహామ్మారి పై పోరాటంలో ఎంతో మంది వైద్యులు పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ శక్తి మించి పనిచేస్తున్నారనే చెప్పాలి. మనదేశంలో ప్రస్తుతం క‌రోనా వైర‌స్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోరుగా చ‌ర్యలు చేప‌డుతున్నాయి. ఈ పోరాటంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు సినీ తారలు.

దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేశారు. జనాభా మొత్తం వారి వారి ఇళ్లల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితులలో సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల కంటే సినీ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులను, పేద కళాకారులకు సెలబ్రిటీలు కూడా చేయూతను అందిస్తున్నారు. ఇండస్ట్రీలో రోజువారీ కూలి పనిచేసే కార్మికులను దృష్టిలో పెట్టుకొని మెల్లగా సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వడానికి కదిలి వస్తున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ కోటిన్నర రూపాయలు కన్నడ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు విరాళంగా అందిస్తున్నాడు.

ఇండస్ట్రీలో పని చేస్తూ డైలీ పూట గడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మూడు వేలమంది కార్మికులకు వారి అకౌంట్స్ లో ఒక్కొక్కరికి 5వేలు జమచేయనున్నట్లు తెలిపాడు. తన తరపున ఇండస్ట్రీకి సోదరభావంతో విరాళం అందిస్తున్నట్లు యష్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి కష్టమైన సమయంలో అందరు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం హీరో యష్ ను ఇండస్ట్రీతో పాటు అభిమానులు కొనియాడుతున్నారు. ఇదిలా ఉండగా.. యష్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ సీక్వెల్ లో నటించాడు. పాన్ ఇండియా మూవీగా కేజీఎఫ్-2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికి ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలు రెట్టింపు చేసింది. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ కాబోతుందో..!