Begin typing your search above and press return to search.

ప్రభాస్ లా తెలివిగా ఆలోచించలేక పోతున్న యశ్‌!

By:  Tupaki Desk   |   3 Aug 2022 10:30 AM GMT
ప్రభాస్ లా తెలివిగా ఆలోచించలేక పోతున్న యశ్‌!
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు. బాహుబలి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు బాలీవుడ్‌ స్టార్స్ రికార్డులను కూడా బ్రేక్ చేసింది. దాంతో ప్రభాస్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తో ప్రభాస్ అక్కడ మరింత పాపులారిటీ సంపాదించుకునేలా సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు.

బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి సినిమా స్థాయికి సాహో ఏ మాత్రం సరిపోలేదు. అయినా కూడా బాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని మాత్రం ఆ సినిమా ఆకర్షించింది. హీరోగా ప్రభాస్ స్థాయిని మరింతగా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందు పెంచింది. అంతే కాకుండా ఆయన కమిట్ అయిన ఇతర సినిమాలు కూడా బాలీవుడ్ లో ప్రభాస్ స్థాయిని పెంచే విధంగా లేదా బాహుబలితో వచ్చిన స్టార్‌ డమ్‌ ను కొనసాగించే విధంగా ఉన్నాయి.

బాహుబలి తో ప్రభాస్ కు వచ్చిన మాదిరిగానే కేజీఎఫ్ తో యశ్‌ కు అద్భుతమైన స్టార్‌ డమ్‌ పాన్ ఇండియా స్థాయిలో వచ్చింది. కేజీఎఫ్ 2 తర్వాత యశ్‌ చేయబోతున్న సినిమా లపై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ సమయంలో ఏది పడితే అది కమిట్‌ అయ్యి మళ్లీ పాతాళంకు పడిపోవద్దనే ఉద్దేశ్యంతో యశ్‌ కిందా మీద పడుతున్నట్లుగా తెలుస్తోంది.

కేజీఎఫ్‌ 2 విడుదల అయ్యి చాలా వారాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన నుండి తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దాంతో యశ్‌ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా యశ్‌ సినిమా ఎంపిక విషయంలో తెలివిగా ఆలోచించలేక పోతున్నాడు అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.

యశ్‌ కేజీఎఫ్ కు ముందు కన్నడం లో ఒక యావరేజ్ హీరో. కన్నడ సినిమా పరిశ్రమలో ఆయన మరో సినిమా చేస్తే అది ఆయన గత చిత్రాల మాదిరిగానే ఉంటుందేమో అనే అనుమానం కూడా ఉంది. దాంతో యశ్‌ తదుపరి సినిమా విషయంలో స్పీడ్ గా నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాడు. తదుపరి సినిమా కూడా కేజీఎఫ్‌ రేంజ్ లో లేకున్నా తన స్థాయిని తగ్గించేది కాకూడదు అని భావిస్తున్నాడు.

అలాంటి సినిమా ఎంపిక చేసుకోవడంకు యశ్‌ చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. యశ్ అలాంటి సినిమా ను కాస్త తెలివిగా ఆలోచించి కమిట్‌ అయితే బాలీవుడ్‌ లో ఆయన సినిమాలకు మరింత డిమాండ్ పెరగడంతో పాటు ఆయన పాన్ ఇండియా మార్కెట్‌ కంటిన్యూ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.