Begin typing your search above and press return to search.
రసగుల్లాతో ఆడుకోవడమే రాకీ భాయ్ పనట!
By: Tupaki Desk | 2 March 2019 8:31 AM GMTదాదాపుగా అందరికీ ముద్దుపేర్లు ఉంటాయి. సెలబ్రిటీల ముద్దు పేర్లు భలే ఇంట్రెస్టింగ్ గా ఒక్కోసారి ఫన్నీగా ఉంటాయి. ఐశ్వర్య రాయ్ ముద్దుపేరు 'గుల్లు'.. రణబీర్ కపూర్ -'డబ్బూ'.. హృతిక్ రోషన్ - 'దుగ్గు'.. ఆలియా భట్ - 'ఆలు'.. శ్రద్ధా కపూర్ - 'మిమి'. ఇక వరుణ్ ధావన్ ముద్దుపేరు మరీ ఫన్నీ.. 'పప్పు'. ఈ పప్పు మీరనుకునే పప్పు కాదులెండి. టాపిక్ మెల్లగా రాజాకీయాలవైపు టర్న్ అయ్యేలా ఉంది కాబట్టి వెంటనే ఆపేసి బాలీవుడ్ నుంచి బెంగుళూరు కెళ్ళిపోదాం.
బెంగుళూరు ఎందుకంటే 'కేజీఎఫ్' స్టార్ యష్ కోసం. అంటే.. యష్ ముద్దు పేరు కోసం కాదు. ఆయన పేరే ముద్దుగా ఉంది.. ఇంకా దానిని కట్ చేస్తే పిలిచేదానికి పేరే మిగలదు! యష్ గారాలపట్టి ముద్దు పేరు కోసం. యాష్ - రాధిక పండిట్ దంపతులకు డిసెంబర్ 2018 లో ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఇంకా అసలు పేరు పెట్టలేదట. పాపకు ఐదో నెల వచ్చిన తర్వాత పేరు పెడతారట. కానీ అంతలోపు ముద్దు పేరు మాత్రం పెట్టారట.. 'రసగుల్లా' అని పిలుస్తున్నారట. నిజంగానే స్వీట్ గా ఉంది కదా. యష్ కు సమయం చిక్కినప్పుడల్లా రసగుల్లాతో ఆడడమే పనట. ఎంత పెద్ద రాకీ భాయ్ అయినా కూతురి దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుకుంటూ మిగతా ప్రపంచాన్ని మరిచిపోతుంటాడట. ఈ విషయం గురించి చెప్తూ తన కూతురు ప్రపంచంలో క్యూటెస్ట్ అని యష్ ఫీల్ అవుతూ ఉంటాడని సీక్రెట్ ను బైటపెట్టేసింది.
అంతే కాదు పాపకు నాన్న పోలికలే ఎక్కుగా ఉన్నాయని కూడా చెప్పింది రాధిక. ఇంకేం.. మంచిదే కదా. బాబైతే అమ్మ పోలిక .. పాపైతే నాన్న పోలిక అదృష్టం అంటారు. ఇదిలా ఉంటే పాప పుట్టిన తర్వాత యష్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా. అంటే నాన్నకు కూడా భారీ లక్కు తెచ్చింది రసగుల్లా.