Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తల్లి పై 'కేజీయఫ్' హీరో ఆసక్తికర వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 14 April 2022 4:47 AM GMTకన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ ''కేజీయఫ్: చాప్టర్ 2'' గురువారం (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న యష్.. తెలుగులో కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు హీరో యశ్ కలిసి యాంకర్ సుమతో ముచ్చటించారు. ఈ క్రమంలో యశ్ తెలుగు హీరోలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా RRR మూవీ గురించి చెప్పమని సుమ అడగ్గా.. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
యష్ మాట్లాడుతూ.. 'ఆర్.ఆర్.ఆర్' ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని.. బిగ్ స్క్రీన్ పై చూసి థ్రిల్ అయ్యానని అన్నాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ గొప్ప నటులని.. వారితో తనకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉందని చెప్పాడు.
''హైదరాబాద్ లో నేను ఎక్కడ షూటింగ్ చేసినా చరణ్ ఇంటి నుంచి భోజనం పంపిస్తాడు. అంతేకాదు మా మధ్య అంతకుమించి స్పెషల్ బాండింగ్ ఉంది'' అని యశ్ తెలియజేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి మరియు ఆయన తల్లి షాలిని ఆతిధ్యం గురించి యశ్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
''తారక్ నన్ను వ్యక్తిగతంగా డిన్నర్ కు ఆహ్వానించారు. ఆయన ఫ్యామిలీ నన్ను చాలా బాగా రీసివ్ చేసుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో మంచి బాండింగ్ కుదిరింది'' అని యశ్ అన్నారు.
'ఎన్టీఆర్ మదర్ కర్ణాటక కు చెందిన వారు కావడంతో మా మధ్య ప్రాంతీయ అనుబంధం కూడా ఏర్పడింది. నన్ను చాలా ప్రత్యేకంగా చూసుకున్నారు. కుటంబంలోని వ్యక్తిగా ట్రీట్ చేశారు. వారి ఆతిథ్యాన్ని ఎప్పటికి మర్చిపోలేను'' అని యశ్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే తారక్ తల్లి శాలిని కర్ణాటకలోని మంగుళూరు/ఉడిపి సమీపంలోని కుందాపూర్ అనే ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ఇటీవల RRR మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ కన్నడలో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు కన్నడ వెర్షన్ కు ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.