Begin typing your search above and press return to search.
యష్.. ప్రభాస్..ఎన్టీఆర్..ఓ బ్లాక్ థీమ్
By: Tupaki Desk | 20 May 2022 1:30 PM GMTబ్లాక్ థీమ్ ఇప్పడు దక్షిణాదిలో హాట్ టాపిక్ గా మారుతోంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పడు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' 2018లో విడుదలై సైలెంట్ గా మోన్ స్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. రాకింగ్ స్టార్ యష్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఈ మూవీకి సీక్వెల్ గా దాదాపు మూడున్నరేళ్ల విరామం అనంతరం 'కేజీఎఫ్ 2' ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సంచలనాలు సృష్టిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
కన్నడకు మించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ ఉత్తరాదిలో బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ స్వైర విహారం చేస్తోంది. బాలీవుడ్ మార్కెట్ లో ఇప్పటికే రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఇండియాలో అత్యధిక శాతం ప్రేక్షకులు వీక్షించిన సినిమాగానూ సరికొత్త రికార్డును సాధించింది. వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల మార్కు వసూళ్లని రాబట్టి మరో రికార్డులకు పరుగులు తీస్తోంది.
త్వరలో ఈ సిరీస్ నుంచి చాప్టర్ 3 కూడా తెరపైకి రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ప్రారంభం లో పార్ట్ 3ని పట్టాలెక్కిస్తామని ఇటీవల ఈ చిత్ర నిర్మాత అధికారికంగా వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. రాఖీ భాయ్ దునియా లోకి మరో సారి ఎంటర్ కావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాలని బ్లాక్ థీమ్ తో తెరపైకి తీసుకొచ్చి ట్రెమండస్ హిట్ లుగా మలిచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీ తరువాత మరోసారి అదే ఫార్ములాతో 'సలార్' మూవీని తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 30 శాతం పూర్తయింది. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ థీమ్ తో విడుదల చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. కోల్ మైన్స్ లో రెండు బ్లాక్ బాక్సులపై కూర్చుని ప్రభాస్ స్టెన్ గన్ ధరించి తీక్షణంగా చూస్తున్న ఓ స్టిల్ ని ఫస్ట్ లుక్ గా వదిలిన విషయం తెలిసిందే. 'ది మోస్ట్ వయిలెంట్ మ్యాన్ .. కాల్డ్ వన్ మ్యాన్..ద మోస్ట్ వయిలెంట్ ' అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు ప్రశాంత్ నీల్.
పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా వయిలెంట్ గా కొత్తగా వుండటం, కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సంచలన విజయాల్ని సొంతం చేసుకోవడంతో ప్రభాస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న 'సలార్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఆ మూవీ ఎలా వుంటుంది? ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ క్రేజీ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. ఇది ఎలా వుండబోతోంది. ఇంతకీ ఈ మూవీ థీమ్ ఏంటీ అనే చర్చ మొదలైంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఈ రోజు ప్రశాంత్ నీల్ నుంచి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూశారు. అంతా ఎదురుచూసినట్టే ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని శుక్రవారం విడుదల చేశారు.
దీనికి కూడా కేజీఎఫ్, సలార్ లకు ఫాలో అయిన బ్లాక్ థీమ్ నే ప్రశాంత్ నీల్ ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'రక్తంతో తడిసిన నేల మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆయన నేల.. ఆయన పాలన.. అయితే అది కచ్చితంగా ఆయన రక్తం కాదు' అని ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఆసక్తికరంగా సినిమా థీమ్ ఏంటో వివరిస్తూ చిన్న హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గుబురు గడ్డం, కోర మీసంతో మోస్ట్ వైలెంట్ గా 'కేజీఎఫ్, సలార్ హీరోల లుక్ లని పోలి కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
బ్లాక్ థీమ్ తో బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ..తాజాగా ఎన్టీఆర్ సినిమాకు కూడా అదే థీమ్ ని ఎంచుకున్నాడంటే ఇది కూడా కోల్ మైన్స్ నేపథ్యంలో సాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాలీవుడ్ మార్వెల్ మూవీస్ తరహాలో ఓకే థీమ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు 'రక్తంతో తడిసిన నేల మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆయన నేల.. ఆయన పాలన.. అయితే అది కచ్చితంగా ఆయన రక్తం కాదు' అని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆసక్తికరమైన పదాలని షేర్ చేయడంతో ఇది కూడా అదే పంథాలో సాగుతుందని స్పష్టం చేస్తోంది. కేజీఎఫ్, సలార్ తాజాగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూసిన వారంతా బ్లాక్ థీమ్ తో ప్రశాంత్ నీల్ మరెన్ని మ్యాజిక్ లు చేస్తాడో .. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.