Begin typing your search above and press return to search.

సుల్తాన్ క‌లెక్ష‌న్ల‌లో గ్యాంబ్లింగ్ ఉందా?

By:  Tupaki Desk   |   4 Aug 2016 4:51 PM GMT
సుల్తాన్ క‌లెక్ష‌న్ల‌లో గ్యాంబ్లింగ్ ఉందా?
X
తొలి మూడు రోజుల్లోనే సుల్తాన్ క‌లెక్ష‌న్లు వంద కోట్ల‌న్నారు.. ఫ‌స్ట్ వీకెండ్లోనే 170 కోట్ల‌న్నారు. వారంలోనే రెండు వందల కోట్లు దాటేసింద‌న్నారు.. ఆరంభంలో వ‌చ్చిన క‌లెక్ష‌న్ల ఊపు చూస్తే పీకే పేరిట ఉన్న హైయెస్ట్ గ్రాస్ రికార్డును కూడా సుల్తాన్ దాటేస్తుందేమో అనుకున్నారంతా. కానీ ఆ త‌ర్వాత చ‌ప్పుడు లేదు. 500.. 600 కోట్లు అంటూ అంచ‌నాలు క‌డితే ఇప్పుడేమో దేశీయంగా 300 కోట్ల మార్కును కూడా అందుకోలేద‌ని వార్త‌లొస్తున్నాయి. దీంతో సుల్తాన్ క‌లెక్ష‌న్ల మ‌త‌ల‌బేంటో జ‌నాల‌కు అర్థం కావ‌డం లేదు. సుల్తాన్ సినిమాను నిర్మించిన య‌శ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థే క‌లెక్ష‌న్ల విష‌యంలో ఏదో గోల్ మాల్ చేస్తోంద‌ని స‌ల్మాన్ అభిమానులు అనుమానిస్తున్నారు.

#YRFStopReducingSULTANFiguresఈ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్ట‌ర్లో సుల్తాన్ అభిమానులు ప్ర‌చారం చేయ‌డం చూస్తుంటే ఎక్క‌డో తేడా జ‌రుగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. 'సుల్తాన్‌' సినిమా దేశీయంగా రూ.300 కోట్ల క్లబ్బులో చేరితే.. లాభాల్లో తనకు వాటా ఇవ్వాలంటూ సల్మాన్‌ నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడని.. దీంతో 'సుల్తాన్‌' రూ. 300 కోట్ల క్లబ్బులో చేరన‌ట్లు తక్కువ వసూళ్లను నిర్మాత చూపిస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐతే మిగ‌తా నిర్మాత‌ల్లాగా క‌లెక్ష‌న్ల‌ను ఎగ్జాజ‌రేట్ చేసి చూపించే అల‌వాటు ఆదిత్య చోప్రాకు లేద‌ని.. అందుకే వాస్త‌విక‌మైన క‌లెక్ష‌న్లను చూపిస్తున్నార‌ని.. స‌ల్మాన్ ఫ్యాన్స్ త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తోంది. ఇంత‌కీ వాస్త‌వ‌మేంటో?