Begin typing your search above and press return to search.

RRR అవ‌న్నీ రూమ‌ర్లు!- య‌శ్‌

By:  Tupaki Desk   |   27 Dec 2018 7:42 AM GMT
RRR అవ‌న్నీ రూమ‌ర్లు!- య‌శ్‌
X
ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న RRR ప్ర‌స్తుతం జ‌నంలో బిగ్ ట్రెండింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సినిమాగా ఇటు మెగాభిమానుల్లో - అటు నంద‌మూరి అభిమానుల్లోనూ ఈ సినిమా హాట్ టాపిక్. ఈ భారీ చిత్రం కోసం అన్ని భాష‌ల స్టార్ల‌ను జ‌క్క‌న్న ఎంపిక చేసుకోవ‌డంతో ఇదో భారీ మ‌ల్టీలింగువ‌ల్ గా రూపాంత‌రం చెందింది.

ఈ సినిమా క‌థ‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ బ్ర‌ద‌ర్స్‌ గా కనిపించ‌నున్నారు. చెర్రీ పోలీసాఫీస‌ర్ గా కనిపిస్తే తారక్ బందిపోటుగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రో కోణంలో ఈ సినిమా క్రీడాకారులైన అన్న‌ద‌మ్ముల క‌థ‌.. ఇందులో ఒకరు బాక్స‌ర్‌ గా క‌నిపిస్తార‌న్న ప్ర‌చారం ఇదివ‌ర‌కూ సాగింది. RRR పై మరెన్నో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. 1930ల నుంచి 2020 కాలంలో సాగే క‌థ ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ - చెర్రీ చనిపోతారు .. ప్రాణ స్నేహితులైన ఆ ఇద్ద‌రూ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులుగా ఒక భీక‌ర పోరాటంలో పోరాడి చ‌నిపోతారు.. అలా చ‌నిపోయిన వారు మళ్లీ జన్మించి ప్రాణ మిత్రులుగా మారతార‌ని ఆ క్ర‌మంలోనే ఎమోష‌న్ కి ఎంతో ఆస్కారం ఉండే క‌థ‌ను రాజ‌మౌళి ఎంచుకున్నాడ‌ని ఒక‌టే ప్ర‌చారం దంచేస్తున్నాయి మీడియాలు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఈ చిత్రంలో కెజిఎఫ్ హీరో య‌శ్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగింది. య‌శ్ చేరిక‌తో క‌న్న‌డ‌లోనూ ఈ సినిమాకి పాపులారిటీ పెర‌గ‌నుంద‌ని - దాంతో మార్కెట్ ప‌రంగా హ‌ద్దులు చెరిపేయ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని స్పెక్యులేష‌న్స్ ర‌న్ అయ్యాయి. అయితే ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌? RRR చిత్రంలో య‌శ్ న‌టిస్తున్నాడా .. లేదా? ఇదే ప్ర‌శ్న య‌శ్ నే అడిగితే నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో అత‌డు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. టాలీవుడ్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల్లో నిజం లేదు. అవ‌న్నీ రూమ‌ర్లు మాత్ర‌మేన‌ని న‌వ్వేశాడు య‌శ్‌. అయితే ఇది రూమ‌ర్ అయినా నిజ‌మైతే బావుంటుందేమో! అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఈ వేదిక వ‌ద్ద సాగింది. కెజిఎఫ్ లాంటి చిత్రంతో క‌న్న‌డ‌లో తొలి 100 కోట్ల క్ల‌బ్ హీరోగా అవ‌త‌రించిన య‌శ్ వ‌ల్ల RRR కు ప్ల‌స్ అవుతుందే కానీ మైన‌స్ అవ్వ‌దు. పైగా కెజిఎఫ్ కోసం - య‌శ్ కోసం జ‌క్క‌న్న అంత‌టివాడే దిగొచ్చి ప్ర‌చారం చేశాడు. ఒక సామాన్య డ్రైవ‌ర్ కొడుకు య‌శ్ క‌న్న‌డ రంగంలో నంబ‌ర్ 1గా ఏల్తున్నాడ‌ని కితాబిచ్చాడు. ఇటు టాలీవుడ్ - అటు బాలీవుడ్ లోనూ కెజిఎఫ్ కి మార్కెట్ చేయించింది, ప్ర‌చారం చేసింది రాజ‌మౌళి. కాబ‌ట్టి య‌శ్ కి RRR మ‌ల్టీస్టార‌ర్‌ లో అవ‌కాశం ఉంటుంద‌నే ఇంకా అభిమానులు న‌మ్ముతున్నారు. మ‌రి జ‌క్క‌న్న ఏం చేస్తాడో వేచి చూడాలి.