Begin typing your search above and press return to search.

యష్ తదుపరి సినిమా పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

By:  Tupaki Desk   |   13 March 2021 7:30 AM GMT
యష్ తదుపరి సినిమా పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
X
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డం సంపాదించుకున్నాడు కన్నడ హీరో యష్. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా కన్నడ చిత్రపరిశ్రమ పేరు మారుమోగిందనే చెప్పాలి. అలాగే యష్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే కెజిఎఫ్2 తర్వాత అభిమాన హీరో ఏ చిత్రంలో నటిస్తాడని యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా యష్ తదుపరి చిత్రం గురించి సినీపరిశ్రమలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'ముఫ్తీ' మూవీ ఫేమ్ నర్తన్.. కేజీఎఫ్ స్టార్ యష్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి స్టార్ హీరో శివరాజ్ కుమార్ 125వ 'భరతి రణగల్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో నర్తన్ ప్రకటించారు. కానీ శివరాజ్ సినిమా వాయిదా పడింది. వెంటనే దర్శకుడు యష్ తో చేతులు కలిపాడు.

అయితే శివరాజ్ కంటే ముందే యష్ కు ఓకే చెప్పానని చెప్పాడు డైరెక్టర్. ఈలోగా అతను శివరాజ్ తో 'భరతి రణగల్'లో అడుగుపెట్టాడు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులలో ఒకేసారి తీయడం కష్టమని భావించి.. అందుకే ఫస్ట్ అంగీకరించిన ప్రాజెక్టును ఫినిష్ చేయనున్నట్లు నర్తన్ క్లారిటీ ఇచ్చారు. యష్ తో సినిమా పూర్తయిన తర్వాత శివరాజ్‌కుమార్‌తో కలిసి భ్రమతి రణగల్‌లో మళ్లీ పనిచేయాలని భావిస్తున్నారట. తాజాగా దర్శకుడు అందించిన సమాచారం ప్రకారం.. యష్ తదుపరి చిత్రం కోసం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు జటస్య అనే పేరును పరిశీలిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో యష్ సరసన తమన్నా నటించనుందని టాక్. చూడాలి మరి ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందో!