Begin typing your search above and press return to search.
యశ్ vs ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కు పెద్ద సవాలే
By: Tupaki Desk | 6 July 2023 5:42 PM GMTభారీ డైలాగ్‌లు లేవు.. సింగిల్ డైలాగ్ మాత్రమే... నటీనటుల ను అందరినీ చూపించలేదు.. ఇద్దరినే ఫోకస్ చేశారు.. కానీ.. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్‌ఫుల్ యాక్షన్ టీజర్ తో 'సలార్' పై భారీ అంచనాల ను పెంచేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరో గా ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ టీజర్ తో అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. కానీ ఒక్కటే అసంతృప్తి.. ప్రభాస్ మొహం చూపించాల్సిందని అంటున్నారు.
అయితే ఇదే సమయం లో సినిమా కథ తెలియక పోయినప్పటికీ రాకీ భాయ్ కేజీయఫ్ తో పోల్చకుండా సలార్ ను పొల్చకుండా ఉండలేకపోతున్నారు. ప్రభాస్ ఎలివేషన్స్ కూడా రాకీ భాయ్ స్థాయి లో, ఇంకొంతమంది అంతకు మించిన స్థాయిలో ఉందని అభిప్రాయపడుతున్నారు. సినిమా థీమ్ కలర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ ఆన్ని పోలుస్తూ హైలైట్ అంటున్నారు.
ఇక విషయానికొస్తే.. యశ్ కేవలం రాకీ భాయ్ పాత్ర మాత్రమే చేయలేదు.. ఆ పాత్రకే ఓ స్వాగ్ తెచ్చారు. దాన్ని మరెవ్వరూ మ్యాచ్ చేయలేరు. ఆ స్టైల్, గంభీరం, అచ్చం గ్యాంగ్ స్టర్ ల ఓ రేంజ్ లో తన మాస్ యాక్టింగ్ తో కట్టి పడేశారు. అంతే తన లుక్ తోను మెస్మరైజ్ చేసేశారు.
ఇక ప్రభాస్ కూడా తక్కువేమీ కాదు. తన భారీ కట్ ఔట్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ లో ఆ ఫిజిక్, మాస్ స్టైల్, లుక్స్ మాములుగా లేవు. ప్రతి ప్రభాస్ అభిమా ని షాక్ అవుతున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ప్రభాస్ చాలా మాస్ గా ఉన్నారని అంటున్నారు.
కానీ ఇవన్నీ ఎలా ఉన్నా కూడా కథ కూడా కేజీయఫ్ కు మించి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభాస్ కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు యశ్ ను మించాలి. లేదంటే కేజీయఫ్ రీమేక్ అనేస్తారు అభిమానులు. కాబట్టి.. ఈ చిత్రం అటు వరుస ఫ్లాప్ లతో ఉన్న ప్రభాస్ కు... ఇటు తన స్టార్ డం ను కొనసాగించాలంటే ప్రశాంత్ నీల్ కు కూడా ఇది చాలా ముఖ్యం. ఇది వీరిద్దరికీ ఓ పెద్ద సవాల్ అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇకపోతే సలార్ కూడా రెండు భాగాలుగా రానుంది. సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్ అంటూ ఈ చిత్రం సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో పార్ట్-2 కూడా ఉంటుందని ప్రభాస్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.