Begin typing your search above and press return to search.
ఫొటోస్టోరీ : తప్పుగా అర్థం చేసుకున్న ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చిన స్టార్
By: Tupaki Desk | 2 July 2020 3:30 PM GMTకన్నడ స్టార్ హీరో యష్ తాజాగా తన భార్య రాధికతో కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఫొటోలో నుదిటిపై యష్ మూడు వేళ్లతో చూపిస్తున్నట్లుగా ఉన్నాడు. అలా ఎందుకు అన్నాడో, ఏ సందర్బంగా ఆ ఫొటో తీశారో తెలియదు కాని నెటిజన్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మూడవ బిడ్డకు వీళ్లు జన్మనివ్వబోతున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. మరికొందరు మరో రకంగా కామెంట్స్ చేశారు.
మీడియాలో ఆ ఫొటోపై వస్తున్న కామెంట్స్ కు రాధిక స్పందించింది. తాను మరోసారి ప్రెగ్నెంట్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. తాము ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నట్లుగా పేర్కొంది. మూడవ సంతానం గురించి ఆమె ఆలోచన లేదన్నట్లుగా పేర్కొంది. ఆమె ప్రకటనతో యష్ అభిమానుల్లో ఒక క్లారిటీ వచ్చేసింది.
ఆ ఫొటో ఏ సందర్బంగా తీశారు అనే విషయంలో మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు. హీరోయిన్ అయిన రాధిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతోంది. మరో వైపు యష్ కేజీఎఫ్ 2 చిత్రం చేస్తున్నాడు. మహమ్మారి వైరస్ కారణంగా కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ నిలిచి పోయింది. త్వరలో పున: ప్రారంభించే అవకాశం ఉంది. అక్టోబర్ లో విడుదల చేస్తామన్న కేజీఎఫ్ 2 కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.