Begin typing your search above and press return to search.

ఔను.. నా స్నేహితురాలి మృతికి నేనే కారణం

By:  Tupaki Desk   |   13 March 2022 11:30 PM GMT
ఔను.. నా స్నేహితురాలి మృతికి నేనే కారణం
X
బిగ్ బాస్ ఫేం యషికా ఆనంద్‌ కి కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలు అయిన విషయం తెల్సిందే. ఓవర్‌ స్పీడ్‌ కారణంగా యాక్సిడెంట్‌ తో గాయాల పాలైంది. గత కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ ఆ సందడి చేయడం లేదు. అలా కనిపించకుండా పోయిన యషికా ఎట్టకేలకు మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది.

సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఆ సమయంలో యాక్సిడెంట్‌ కు సంబంధించిన పలు వివాదాస్పద ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సమాధానాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యాక్సిడెంట్ కు సంబంధించిన ప్రశ్నలకు ఆమె స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

ఒక నెటిజన్.. మీరు మళ్ళీ డ్రైవింగ్ కి వెళ్లడం లేదు ఎందుకు గతంలో మీరు డ్రైవింగ్ మరియు రైడింగ్ అంటే చాలా ఇష్టం అని అన్నారు. మీరు దాన్ని వదిలేసినట్లేనా అంటూ ప్రశ్నించగా.. అవును నేను దాన్ని వదిలేశాను. ఎందుకంటే మీరందరూ కూడా నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని నేను చంపాను అని అంటున్నారు. అందుకోసమే నేను నా డ్రైవింగ్ మానుకోవడం ఉత్తమం అని నిర్ణయానికి వచ్చాను అని సమాధానమిచ్చింది.

మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పిన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఒక నెటిజన్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా చనిపోయారు అని ప్రశ్నించగా.. నా ఫాస్ట్ డ్రైవింగ్ వల్లే నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయారు అంటూ సమాధానం ఇచ్చింది. మొత్తానికి యషికా ఆనంద్‌ ఆ యాక్సిడెంట్ నుండి మెల్ల మెల్లగా బయటపడాలని భావిస్తున్న కూడా నెటిజెన్స్ మరియు ఆమె చుట్టూ ఉన్నవారు యాక్సిడెంట్ కి సంబంధించిన విషయాలు మర్చిపోనిచ్చే పరిస్థితి లేదు. కనుక ఆమె రెగ్యులర్ గా యాక్సిడెంట్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.

ఒక పార్టీ కి వెళ్లి వస్తూ అర్ధరాత్రి సమయంలో అతి వేగంతో ప్రయాణిస్తూ ఉండడం వల్ల యషికా ఆనంద్‌ మరియు స్నేహితురాలు ఉన్న కారు యాక్సిడెంట్ అయింది. దాంతో స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందగా ఆనందం మాత్రం గాయాలతో బయటపడింది. అప్పటి నుంచి కూడా యషికా ఓవర్ స్పీడ్ కారణంగానే ఆమె స్నేహితురాలు మృతి చెందింది అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఆ ట్రోల్స్‌ వస్తున్నాయి. తాజాగా ఆమె స్వయంగా స్నేహితురాలు నా ఓవర్ స్పీడ్ కారణమంటూ చెప్పడంతో కాస్తయినా ఆమెపై వస్తున్న విమర్శలు తగ్గుతాయా లేదంటే పెరుగుతాయా అనేది చూడాలి.